-
కేసీఆర్‌తో కానిది రేవంత్‌తో అయిందిలా..!
-
నాగార్జున అక్రమకట్టడం నేలపాలు..!!
-
ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా అనుమానాలకు సమాధానమా..?
కేసీఆర్‌కు రెండు నాలుకలు. డౌటే లేదు. అవసరం ఉన్నప్పుడు ఒకతీరు. ఆ తరువాత మరోలెక్క. పొగిడిన నోటితోనే ఆ వెంటనే తెగడగలడు కూడా. ఏ మాత్రం సంకోచించకుండా. నిలకడ లేదు. నిబద్దత అసలే లేదు. ఇప్పుడివన్నీ ఎందుకంటే .. తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్లనందరినీ రాక్షసులుగా అభివర్ణించిన నోటితోనే ఆ తరువాత వారి కాళ్లలో ముల్లు గుచ్చితే నోటితో తీస్తానన్నాడు.అక్రమ కట్టడాల విషయానికొస్తే హీరో నాగార్జున ఎన్ ఎన్వెన్షన్ పూర్తిగా చెరువులో కట్టిందే. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్‌కు తెలుసు. కానీ వదిలేశారు. ఈ హీరోదే కాదు చాలా మంది నేతల అక్రమాలను, అక్రమార్కులను తల్లికోడిలా తన కింద పెట్టుకుని కాపాడుకున్నాడు. ఇప్పుడు రేవంత్ టైం వచ్చింది. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ వంతు వచ్చింది. అదిప్పుడు నేలమట్టమయ్యింది. అంతా అవాక్కయ్యారు.
కేసీఆర్ చేయని పని రేవంత్ చేస్తున్నాడంటున్నారు. రాజకీయ కక్షలు, ప్రతీకారాలు, పగసాధింపులు లేకుండా అందరినీ ఒకే గాటన కట్టి ఈ చర్యలా..? అయితే ఓకే..? సర్వామోదం ఉంటుంది.బహుబాగంటారు. కాన మధ్యలో వీటిని ఆపావో. నువ్వూ ఓ కేసీయారే. ఫక్తు రాజకీయ నాయకుడివే. ఇప్పుడు రేవంత్ ఈ విషయంలో పులి మీద స్వారీ చేస్తన్నాడు.
కేటీఆర్ నోటికి హైడ్రా తాళం..! నాగార్జున అక్రమకట్టడం కూల్చివేతతో బీఆరెస్ షట్ అప్..!!
గురుతులు చెరిపేయడం అంటే ఇదే కాబోలు.. కేసీఆర్ గుర్తులే లేకుండా చేస్తానన్నాడు రేవంత్. ఆ పాలనలో సాగిన తీరుకు భిన్నంగా పూర్తి విరుద్ధంగా పోవడమే తన విధానంగా పెట్టుకున్నాడు ఈ సీఎం. అది పాలనలోనే కాదు సంస్కరణలో కూడా కనిపిస్తుంది. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..? అని చీమ కథలాగా హైదరాబాద్‌లో పెద్ద పెద్ద స్టార్లు, పారిశ్రామికవేత్తుల, నేతల అక్రమకట్టడాలు ఎన్నో ఉన్నాయి.
అవన్నీ అప్పటి పాలకులు కేసీఆర్, కేటీఆర్‌లకు తెలుసు. కానీ ఏం చేయలేదు. వారి బలహీనతలను ఆసరా చేసుకుని అలా పాలన కొనసాగించారు. కానీ ఆ అక్రమసామ్రాజ్యల జోలికి పోలేదు. తిలాపాపం తలాపిడికెడు అన్నట్టు ఈ పదేళ్లు బీఆరెస్ నేతలూ అక్రమకబ్జాల బాగోతం కొనసాగించారు. బీఆరెస్‌లో ఉన్నదెవరు..? మళ్లీ పాత నీరే. ఆ పార్టీ ఈ పార్టీల నుంచి వచ్చిన అదే పాతసారానే. అంతా కలిసి విలువైన హైదరాబాద్ భూములను ప్రసాదంలా పంచుకుని తిన్నారు.
అప్పుడు తేలు కుట్టిన దొంగలా ఉండిపోయాడు కేటీఆర్. హైడ్రా ఒకటి ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాల బాగోతంపై రేవంత్ ఫోకస్ పెట్టగానే కలుగులోంచి ఎలుక బయటకు వచ్చింది. కేటీఆర్‌కు చెందిన జన్వాడా ఫామ్‌హౌజ్ జోలికి రాగానే ..అది తనది కాదని బుకాయిస్తూనే.. మీ నేతలేం తక్కువా..? ఇగో చూడు ఎంత మందివి ఉన్నావో అని లిస్టు బయటపెట్టాడు చిన్న పిల్లాడిలా.
మరి మా పాలనలో కదా వీరంతా అక్రమంగా నిర్మించుకున్నారు..? అప్పుడు మేం ఏం చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నాం కదా..? అని సోయి కూడా మరిచాడు. ఇప్పుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం కూల్చివేయడంతో కేటీఆర్ నోటికి తాళం పడ్డట్టయ్యింది. ఇక ఫామ్‌హౌజ్ దాకా రాకమానరు అనే సంకేతం అతగాడికి అందింది. ఇక రాజకీయం రంజుగా ఉండనుంది.