బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం, నియోజకవర్గానికి సైతం రావడం లేదని గజ్వేల్ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్‌భవన్ వరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరుకాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌కు వినతిపత్రం అందించనున్నారు.