Wednesday, April 2, 2025

అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ గైర్హాజ‌రు!

ఎర్రవల్లిలోని తన నివాసంలో గురువారం రాత్రి బాత్ రూంలో కాలు జారిపడటంతో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఎడమకాలు తుంటి ఎముక ప్రాక్చర్ అయింది. వెంటనే సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వారికి యశోద దవాఖానాలో డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. సిటీ స్కాన్ చేసిన వైద్యులు ఎడమకాలి తుంటి విరిగిందని, శస్త్రచికిత్స ద్వారా రీప్లేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆయ‌న కోలుకోవడానికి ఇందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుదని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న కేసీఆర్ వెంట భార్య శోభమ్మ, తనయుడు మాజీ మంత్రి కేటీఆర్, కూతురు కవిత ఎంపీ సంతోష్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. వార్త తెలిసిన నేపధ్యం లో పరామర్శించేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. కాగా కేసీఆర్ కు శస్త్ర చికిత్స జరుగుతున్న నేపధ్యంలో డాక్టర్లు ఎవరిని అనుమతించడం లేదు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నేతలు, అభిమానులు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ నిర్వ‌హించే అసెంబ్లీ స‌మావేశాల‌కు కేసీఆర్ హాజ‌రు కార‌ని స్ప‌ష్ట‌మైంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com