Thursday, December 26, 2024

కాళేశ్వరం నుంచి కార్ రేసింగ్ వరకు కెసిఆర్ అవినీతి….

  • ఫోన్ ట్యాపింగ్‌లో కెటిఆర్, కవిత, కెసిఆర్ అందరూ భాగస్వాములే
  • టిపిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి

కాళేశ్వరం నుంచి కార్ రేసింగ్ వరకు అన్నింటిలో కెసిఆర్ అవినీతి బయట పడ్డదని టిపిసిసి అధికార ప్రతినిధి భవానీరెడ్డి అన్నారు. గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో అవినీతే జరగలేదని హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డిలు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. కెసిఆర్ చెబితేనే చేశామని అప్పటి అధికారులే విచారణలో చెప్పారన్నారు. ఏ తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని, వాయిదాలు ఎందుకు కోరుతున్నారని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో కెటిఆర్, కవిత, కెసిఆర్ అందరూ భాగస్వాములేనని అన్నారు.

హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీస్తారని, కానీ, కెసిఆర్ చేసిన అవినీతిని వెలికి తీసేవరకు వదిలేది లేదని ఆమె హెచ్చరించారు. అవినీతికి కెసిఆర్ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్లని ఆమె ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో జస్టిస్ నరసింహా రెడ్డి కమిటీ విచారణకు పిలిస్తే కెసిఆర్ ఎందుకు గడువు అడుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో 5వేల పాఠశాలను మూయించారన్నారు. ఎన్నికల కోడ్ వల్ల కల్వకుంట్ల కుటుంబ అవినీతిపై జరుగుతున్న విచారణ కొంత ఆలస్యమైందన్నారు. కెసిఆర్ కుటుంబం గొర్రెలు, చేపల పంపిణీ నుంచి మొదలు పెడితే శానిటరీ ప్యాడ్స్ వరకు అన్నింటిలోనూ అవినీతి చేశారని ఆమె మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com