Monday, July 1, 2024

విద్యుత్ కమిషన్ రద్దుపై కెసిఆర్ పిటిషన్

తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఏర్పాటయిన విద్యుత్ కమిషన్ చట్ట విరుద్ధమంటూ హైకోర్టులో తెలంగాణ మాజీ సిఎం కెసిఆర్ దాఖ్లు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కెసిఆర్ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా? లేదా? అనే దానిపై వాదనలు ముగిశాయి. అనంతరం కెసిఆర్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసినట్టు హైకోర్టు ప్రకటించింది. సోమవారం లోపు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది.
కెసిఆర్ దాఖలు చేసిన్ పిటిషన్‌ను విచారణ స్వీకరించవద్దని అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట వాదించారు. విద్యుత్ కొను గోళ్లలో ఏమైనా అనుమానాలుంటే కమిషన్ ఏర్పాటు చేసు కోవచ్చని బిఆర్‌ఎస్ పార్టీయే గత అసెంబ్లీ సమావేశంలో సూచించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కమిషన్ ఇప్పటికే 15 మందిని విచారించిందని, అందులో మాజీ సిఎండి ప్రభాకర్ రావు కూడా ఉన్నారని ఎజి ధర్మాసనానికి వివరించారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని కమిషన్ ప్రకటన కూడా ఇచ్చిందని, ఈ మేరకు ఎంఎల్‌సి కోదండరాం, విద్యుత్ జెఎసి నేత రఘుతో పాటు కొంతమంది సాక్ష్యాలు కూడా సమ ర్పించారని సుదర్శన్ రెడ్డి కోర్టుకు వెల్లడించారు. వాళ్లు సమ ర్పించిన సాక్ష్యాలపై వివరణ ఇవ్వాలని కెసిఆర్‌కు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఈ నెల 19న మరో నోటీసు జారీ చేశారన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కమిషన్ బహిరంగ విచారణ చేస్తోందని, ఇందులో పక్ష పాత ధోరణి అనేదే లేదని ఎజి తెలిపారు. పిటిషన్‌ను విచారణకు అనుమతించడంపైనే వాదనలు వినిపించాలని మెరిట్స్‌లోకి వెళ్లవద్దని ఎజికి ధర్మాసనం సూచించింది.

ఎజి వాదనలపై కెసిఆర్ న్యాయవాది ఆదిత్యా సోంధీ అభ్యంతర వ్యక్తం చేశారు. జ్యుడిషియల్ విచారణగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దానిపై నివేదిక ఇవ్వాలే గానీ, మీడియాకు వివరాలు వెల్లడించకూడదు. విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ముందే చెప్పి కారకులెవరో తేల్చమన్నారని ఇది ఉద్దేశ పూర్వకమని వాదించారు. విద్యుత్తు కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘంను ప్రభుత్వం నియమించింది. ఈ ఏడాది మార్చి 14న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ సంఘాన్ని నియమించింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. జస్టిస్ నరసింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. నంబర్ కేటాయించేందుకు నిరాకరించారు.

కెసిఆర్ పిటిషన్ గురువారం హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. దాదాపు 45 నిమిషాలపాటు వాద ప్రతివాదనలు జరిగాయి. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. పిటిషన్‌కు నంబర్‌ను కేటాయించాలని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తు న్నారంటూ పిటిషనర్ అభియోగాలు మోపినందున విచారణ చేపడతామ్నారు. ఆ మేరకు శుక్రవారం విచారణ చేపట్టారు. విద్యుత్ కమిషన్ ఏర్పాటును కెసిఆర్ వ్యతిరేకంచారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అంటున్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగిందని కెసిఆర్ అన్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular