సినిమా వాళ్లకి పేరుంటుంది, గ్లామరస్‌గా మెరుస్తుంటారు. ఈ రంగంలో జరిగిన తప్పులు బయటకు వచ్చినట్టుగా మిగిలిన రంగాల్లో జరిగే తప్పులు బయటకు రావు. క్యాస్టింగ్ కౌచ్ అనేది సమాజంలో ఉన్న చాలా రుగ్మతల్లో ఒక రుగ్మత ఇది కూడా. అది ఇండస్ట్రీలో కూడా ఉంది. దాన్ని ప్రత్యేకంగా చూడక్కర్లేదు. ” ఇండస్ట్రీకి వచ్చే న్యూ ట్యాలెంటెడ్, అందమైన అమ్మాయిలను అవసరాలకు అనుగుణంగా వాడుకోవడం కరెక్టే అన్నట్లు ఉన్నాయి కీరవాణి వ్యాఖ్యలు. ఒక ఆస్కార్ విన్నర్, లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు గాంచిన కీరవాణి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఇదేం సంస్కారం అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవల లేడీ సింగర్ ప్రవస్తి పాడుతా తీయగా సింగింగ్ షోలో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, చంద్రబోస్ తనకి అన్యాయం చేశారని, తన తప్పు లేకుండానే ఎలిమినేట్ చేశారని ఆమె ఆరోపించింది. ఇది ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అయ్యింది. దీనికి సింగర్ సునీతతోపాటు కొందరు సింగర్లు కౌంటర్లు ఇచ్చారు. అదే సమయంలో `పాడుతా తీయగా` ప్రోగ్రామ్ నిర్వహకులు కూడా వివరణ ఇచ్చారు. సింగర్ ప్రవస్తి `పాడుతా తీయగా` షోపై చేసిన కామెంట్లు చిత్ర పరిశ్రమలో వివాదాస్పదమయ్యాయి. మ్యూజిక్ రంగంలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆమెని విమర్శించారు. మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. సింగర్ సునీతపై బాగా ట్రోలింగ్ జరిగింది. కీరవాణిపై కూడా కొందరు విమర్శలు చేశారు. ఇదంతా పెద్ద ఇష్యూ అయ్యింది.
అయితే కొన్ని సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు సింగర్ల విషయంలో ఇలా చేసిన సన్నివేశాలు పెట్టడం వల్ల ఇలాంటి టాక్ ఇంకా ఎక్కువగా వినిపిస్తుంద`న్నారు కీరవాణి. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అని అన్నారు. అయితే కేవలం దొరికితే దొంగ అనేదే కాదు, అలాంటి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చినా కూడా అతను దొంగనే. కానీ ఆ విషయాలు బయటకు రావు, నిజం చెప్పాలంటే అది కూడా తప్పే అని తెలిపారు కీరవాణి. ఈ లెక్కలు తీస్తే దేశంలో ఇలాంటి చెడు ఆలోచనలు లేని వాళ్లు ఒక పది మంది కూడా ఉంటారా? అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఉన్నట్టుగానే మ్యూజిక్ రంగంలోనూ ఉందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. అంటే ఈ పరిస్థితులను బట్టి సినీ రంగంలో.. అందులోనూ సంగీత రంగంలో ఇది మరి కాస్త ఎక్కువగానే ఉన్నట్టు మన ఆస్కార్ విన్నర్ కీరవాణి చెప్పకనే చెప్పారు.