బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియాభట్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఏకంగా సీనియర్ భామలతోనే పోటీ పడుతుంది. వాళ్లతో సమాన పారితోషికం అందుకుంటుంది. హాలీవుడ్ లో నటించిన అనుభవం..బాలీవుడ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే సంపాదిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కథ నచ్చితే ఎలాంటి సినిమాలైనా ఓకే అంటూ ముందుకెళ్తుంది. అలాగే కియారా అద్వాణీ కూడా ఇదే దూకుడుతో సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోకి హాని చేయొద్దంటూ గ్యాంగ్ స్టర్‌కి విన్నపం ఇప్పటికే నటిగా తన బ్రాండ్ బాలీవుడ్ లో వేసేసింది. ఎలాంటి పాత్రలైనా కియారా ఓకే అంటూ దూసుకుపోతుంది.
యంగ్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ కియారా అనే ముద్రను వేసుకుంది. కియారా…అలియా భారీ స్టార్ డమ్ ఉన్న హీరోయిన్లు. అయితే వీళ్లిద్దరితో పాటు పోటీకి సై అంటోంది కీర్తిసురేష్. అమ్మడు ఇప్పుడే బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టింది. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. కమిట్ అయిన చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. అయినా తగ్గేదేలే అంటూ నార్త్ లో ఆ ఇద్దరితో ఓ సినిమా విషయంలో పోటీకి దిగింది. కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఓ సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా ఈ ముగ్గురి భామల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముగ్గురుతోనూ దర్శకుడు సంప్రదింపులు జరిపారు. అయితే వాళ్లలో ఎవర్ని తీసుకో వాలి? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఉన్న ఒక్క హీరోయిన్ పాత్రకు ముగ్గురు పక్కాగా సరిపోవడంతో? దర్శకుడు ఎంపిక విషయంలో తర్జన భర్జన పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది.