మద్య విధానం కుంభకోణంలో దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజీవ్రాల్ కు చుక్కెదురైంది. మద్యం విధానంలో అక్రమాలపై సీబీఐ అరెస్టును సమర్థించింది. తన అరెస్ట్‌ను సవాలు చేస్తూ కేజీవ్రాల్ పిటిషన్ దాఖలు చేయగా.. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్‌ను కొట్టి వేసింది.
సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తునూ కొట్టి వేసింది. అయితే, బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తొలుత కేజీవ్రాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఊరట లభించినప్పటికీ.. మద్యం విధానంలో అక్రమాలపై కేసు నమోదు చేసిన సీబీఐ.. తిహాడ్ జైల్లో కేజీవ్రాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో జులై 12న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరై నప్పటికీ.. సీబీఐ కేసు కారణంగా ఆయన ప్రస్తుతం కేజీవ్రాల్ జైల్లో ఉన్నారు.