Friday, February 21, 2025

కాళేశ్వరం పిటిషనర్‌ను చంపేశారు మేడిగడ్డ ప్రాజెక్ట్‌ అక్రమాలపై కేసు వేసిన వ్యక్తి హత్య

మేడిగడ్డ ప్రాజెక్ట్‌లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసిన వ్యక్తి విచారణకు ఒక్క రోజు ముందు హత్యకు గురయ్యారు. సొంత ప్రాంతంలోనే కాపు కాసిన నలుగురు వ్యక్తులు నరికి చంపారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన లింగమూర్తి అనే వ్యక్తి రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. భూపాలపల్లిలోని రెడ్డి కాలనీలో రాత్రి పదిగంటల సమయంలో దుండగులు కత్తిలతో దాడి చేశారు. ఈ దాడిలో తలకు, పొట్టలో తీవ్ర గాయాలపాలైన లింగమూర్తి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. పథకం ప్రకారమే లింగమూర్తి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మేడిగడ్డలో అక్రమాలు జరిగాయని కేసు వేయడంతోనే కక్ష కట్టారని, అందుకే చంపేశారని దీనికి వ్యక్తిగతకక్షలు అనే రంగు పులుముతున్నారని బోరుమంటున్నారు.
కాగా, మేడిగడ్డ అక్రమాలపై లింగమూర్తి కేసు వేయగా కేసీఆర్, హరీశ్ రావులతోపాటు నిర్మాణ కంపానికి భూపాలపల్లి జిల్లా కోర్టు గతంలో నోటీసులిచ్చింది. ఈ కేసుపై గురువారం విచారణ ఉండగా ఒక్క రోజు ముందు లింగమూర్తి హత్యకు గురికావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మాజీ కౌన్సిలర్‌ నాగవెళ్లి సరళ భర్తే రాజలింగమూర్తి. గతంలో కూడా రెండు సార్లు ఆయనపై హత్యాప్రయత్నం జరిగింది. రెడ్డికాలనీకి వెళ్తున్న టైంలో కాపు కాచిన దుండగులు కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. హత్య జరిగిన తర్వాత ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అత్యంత విలువైన ఎకరా భూమి విషయంలో తగాదా నడుస్తోందని ఆ నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంజయ్, కొమరయ్యతో చాలా కాలంగా నడుస్తున్న వివాదంలో పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో కూడా పంచాయితీలు జరిగినట్టు సమాచారం.
దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్‌గా అయ్యారు. పోలీసుల వద్ద ఆరా తీసి ఏం జరిగిందో తెలుసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు సీఐడీ విచారణకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com