Sunday, September 29, 2024

Kenya War On India’s Crows: భారత్ కాకులపై యుధ్దం ప్రకటించిన కెన్యా

10 లక్షల కాకులను చంపెయ్యాలని నిర్ణయం

ఇండియా కాకులపై యుధ్దం ప్రకటించింది కెన్యా ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చిన కాకులను యుద్దప్రాతిపదికను చంపెసే దిశగా ముందుకెళ్తోంది కెన్యా. కాకులపై యుధ్దమేంటీ? అందులోను ఇండియా కాకులపై అంత పగ ఎందుకు అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే.. ఇండియా నుంచి పెద్ద ఎత్తున వచ్చిన కాకులు తమ దేశ పర్యావరణం, పరిశ్రమలను దెబ్బ తీస్తున్నాయని ఆరోపిస్తోంది కెన్యా దేశం.

 

భారత్ నుంచి కెన్యాకు వెళ్తున్న కాకులు సంఖ్య అంతకంతకు పెరిగిపోతోందట. దీంతో కెన్యాలో ఎక్కడ చూసినా కాకులే కనిపిస్తున్నాయి. అవి ఆహారాన్ని దొంగలించడం, పంటలకు నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడటం, పరిశ్రమలకు నష్టం కలిగించడం వంటి అనేక కారణాలతో కాకులను అంతమొందించాలని నిర్ణయించింది కెన్యా ప్రభుత్వం. ఇక్కడ ప్రజలే కాదు పెద్ద వ్యాపారవేత్తలు సైతం కాకులపై ప్రభుత్వానికి పిర్యాదు చేశారు.

 

తామ తమ పరిశ్రమలను భారత్ నుంచి వచ్చిన  కాకులు దెబ్బ తీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలాదిగా వస్తున్న కాకులు తమ పరిశ్రమల్లో తయారు చేసిన వస్తువులను నాశనం చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇక పర్యావరణ ప్రేమికులు సైతం దేశంలో కాకులు లేకుండా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చిన కాకులతో పర్యావరణ పూర్తిగా దెబ్బతింటోందని అంటున్నారు.

 

మరోవైపు ఇండియా నుంచి వచ్చిన కాకుల దెబ్బకు కెన్యాలోని సముద్ర తీరాల్లో ఉండే చిన్న, స్థానిక పక్షుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందట. భారత్ నుంచి వెళ్లిన కాకులు పక్షుల గూళ్లు, వాటి గుడ్లు, పిల్లలను తింటున్నాయని ఆరోపిస్తున్నారు. ఇటువంటి కారణాలన్నింటితో సుమారు 10 లక్షల కాకులను అంతమొందించాలని కెన్యా ప్రభుత్వం నిర్ణయించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular