Sunday, April 20, 2025

డార్క్ టూరిస్టులు రావద్దని కేరళ పోలీసుల హెచ్చరిక

  • డార్క్ టూరిస్టులు రావద్దని కేరళ పోలీసుల హెచ్చరిక
  • డార్క్ టూరిజం గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్న నెటిజన్స్

దేవ భూమి కేరళ అతలాకుతలమైంది. వయనాడ్ జిల్లాలో ఐదు రోజుల క్రితం ప్రకృతి సృష్టించిన విపత్తు చాలా కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి వందల మంది మృత్యువాతపడ్డారు. వందల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఒక విధంగా చెప్పాలంటే గ్రామాలకు గ్రామాలనే నేలమట్టం చేసింది ప్రకృతి ప్రకోపం. మండక్కై, చూరాల్మల గ్రామాలు నామరూపాల్లేకుండా ధ్వంసమైయ్యాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

మెల్ల మెల్లగా వయనాడ్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నా.. ఆర్మీతో పాటు పోలీసు బలగాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు సమారు వెయ్యి మందికిపైగా స్థానికులను రక్షించాయి ఆర్మీదళాలు. ఈ క్రమంలో డార్క్ టూరిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్ లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని. డార్క్ టూరిస్టులు అక్కడికి రావద్దని, వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు కేరళ పోలీసులు.

కేరళ పోలీసుల హెచ్చరికల నేపధ్యంలో డార్క్ టూరిస్టులు అంటే ఎవరు, అసలు డార్క్ టూరిజం అంటే ఏంటన్న సందేహం చాలా మందిలో కలుగుతోంది. దీంతో డార్క్ టూరిజంపై గూగుల్ లో వెతుకున్నారట. పదుల సంఖ్యలో మరణాలు జరిగినప్పుడు, పెద్ద విషాద ఘటనలు జరిగినప్పుడు, హింసాత్మక సంఘటనలు చలరెగినటువంటి వివిధ సందర్బాల్లో.. ఆయా ప్రాంతాలను వెళ్లడాన్నే డార్క్ టూరిజం అంటారు.

ఈ కేటగిరీలో సమాధులు, మార్చురీలు, స్మశానవాటికలు, యుద్ద భూములు, ఉరితీసే ప్రాంతా లతో పాటు ఇప్పుడు కేరళలో జరిగినటువంటి విపత్తు ప్రాంతాలు ఉంటాయి. ఆయా సంఘటనలకు సంబందించిన వివరాలు స్వయంగా తెలుసుకునేందుకు, ఆయా ప్రదేశాల చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవడమే డార్క్ టూరిజం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంతే కాదు పెద్ద ఎత్తున మరణాలు సంబవించినప్పుడు అక్కడి విషాదాన్ని ప్రత్యక్షంగా చూడటంతో పాటు ఆ విషాదాన్ని అనుభవించిన వారి ఎమెషన్స్ తో కనెక్ట్ అయ్యేందుకు డార్క్ టూరిస్టుల ఆరాటపడుతుంటారు.

ఇక ఎలాగూ అక్కడికి వెళ్లాక వీడియోల తీసుకోవడం, ఫోటోలు, సెల్ఫీలు వంటివి డార్క్ టూరిజంలో సర్వసాధారణమని చెప్పవచ్చు. ఇప్పుడు కేరళలోని విపత్తును స్వయంగా చూసేందుకు దేశ, విదేశాల నుంచి చాలా మంది డార్క్ టూరిస్టులు వయనాడ్ కు వస్తున్నారట. దీంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్న నేపధ్యంలో డార్క్ టూరిస్టులు వయనాడ్ రావద్దని హెచ్చరిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com