Friday, May 9, 2025

ఇక, నేతల వంతు

  • ఫోన్​ ట్యాపింగ్​లో కీలక నిర్ణయం
  • అధికారుల వాంగ్మూలంతో కేసులు
  • రాజకీయ నేతలకు నోటీసులు

టీఎస్​, న్యూస్​: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎస్​ఐబీ పోలీసుల వరకు సాగిన విచారణ.. ఇప్పుడు రాజకీయ నేతలకూ చేరుతున్నది. ఈ కేసులో ఇప్పటిదాకా పోలీసులను విచారించిన సిట్​ దర్యాప్తు బృందం.. ఇప్పుడు ఈ కేసులో భాగస్వాములుగా భావిస్తున్న వారందరినీ విచారణకు పిలువాలని నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్​ విచారణలో బయటకు వస్తున్న రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఎవరెవరికి నోటీసులు అందుతాయనేది ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది.

ఎవరెవరు..?
ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంలో ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ఆఫ్​ ది రికార్డుగా బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో కీలక నేతలకు లింకులున్నట్లుగా తేలింది. పార్టీ కీలక నేత, మాజీ మంత్రి, మరో కీలక నేత, రాజ్యసభ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, మరో మాజీ మంత్రి.. ఇలా పలువురు ఈ కేసులో ఉన్నట్లు లీకులు వచ్చాయి. అంతేకాకుండా విపక్షాలు మాత్రం ఏకంగా అప్పటి సీఎంఓపైనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. సీఎం నుంచి ఆదేశాలు లేకుంటే ఈ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం సాగదంటూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎంతో పాటుగా కీలక నేతలకు లింకులున్నాయని అనుమానాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టాస్క్​ఫోర్స్​ మాజీ డీసీపీ రాధా కిషన్​రావు అరెస్ట్​ తర్వాత పలువురి పేర్లు చెప్పినట్లు కూడా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతలను విచారణకు పిలిచేందుకు నోటీసులు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com