Sunday, April 20, 2025

సిఎం రేవంత్ సమక్షంలో బిజెపిలో చేరిన ముఖ్య నాయకులు

అధికార పార్టీ కాంగ్రెస్‌లోకి నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా శనివారం బిజెపి నుంచి మరో ఇద్దరు నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే మక్తల్ బిజెపి నేత జలంధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పులిమామిడి రాజు, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డిలు బిజెపి అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com