Saturday, February 22, 2025

ఖైదీ2లో విశ్వనటుడు

`ఖైదీ 2` ప‌నులు దర్శకుడు వేగ‌వంతం చేసిన సంగ‌తి తెలిసిందే. లోకేష్ `కూలీ` షూటింగ్ నుంచి రిలీవ్ అవ్వ‌గానే? పూర్తి స్థాయిలో `ఖైదీ 2` వ‌ర్క్ లో బిజీ అవుతారు. అయితే ఈలోగా బ్యాకెండ్‌లో పూర్తి చేయాల్సిన ప‌నుల‌న్నింటిని అత‌డి టీమ్ ముగిస్తుంది. దీనిలో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే సినిమాలో రోలెక్స్ పాత్ర‌లో య‌ధావిధిగా సూర్య కంటున్యూ అవుతాడ‌నే ప్ర‌చారంలో ఉంది. తాజాగా `ఖైదీ2`లోకి విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందులో క‌మ‌ల్ హాసన్ ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్నారుట‌. ఈ సినిమా క్లైమాక్స్ లో `విక్రమ్ 2`కి లీడ్ ఇచ్చేలా క‌మ‌ల్ హాస‌న్ పాత్ర ఉంటుంద‌ని అంటున్నారు. దానికి సంబంధించి త‌ల‌ప‌తి విజ‌య్ తో వాయిస్ ఓవ‌ర్ ఇప్పించాల‌ని లోకేష్ ప్లాన్ చేస్తున్నాడుట‌. `ఖైదీ`, `విక్ర‌మ్`, `లియో `ల త‌ర్వాత లోకేష్ యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తోన్న చిత్రమిది. ఖైదీ 2కి ఎలా లింక్ అయ్యాయి? అన్న‌ది లోకేష్ చూపించ‌నున్నాడుట‌. దీనిలో భాగంగానే రోలెక్స్ రోల్ ఎంట‌ర్ అయింది. విక్ర‌మ్ ని కూడా అందుకే తెర‌పైకి తెస్తున్నారు. ఇంకా సినిమాలో చాలా పాత్ర‌లు ఎంట‌ర్ అయ్యే అవ‌కాశం ఉంది. వాటితో పాటు కొత్త పాత్ర‌లు అద‌నంగా క‌లుస్తాయి. అంద‌తా స్క్రిప్ట్ ని బ‌ట్టి ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com