Saturday, April 19, 2025

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రండి

  • వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రండి
  • సిఎం రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల ఆహ్వానం

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు రావాలని సిఎం రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఖైరతాబాద్ లోని గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా 70 అడుగుల పెద్ద విగ్రహాని నెలకొల్పి, వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఉత్సవ కమిటీ నిర్ణయంచింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో జరిగే ఉత్సవాలకు హాజరు కావాలని సిఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

గురువారం జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇతర కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అర్చకులు సిఎం రేవంత్ రెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దానం నాగేందర్ సిఎం కు శాలువ కప్పి సత్కరించారు. ఈ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు సిఎంకు పుష్పగుచ్ఛం అందజేసి, ఉత్సవాలకు తప్పక హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com