Thursday, April 10, 2025

ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

  • ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

తాను ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఓ టివి చానల్ డిబెట్‌లో కెటిఆర్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్నన్నీ రోజులు నాలా కబ్జా పెట్టాలని దానం నాగేందర్ ప్రయత్నించారని తాము కబ్జా కానీయ్యలేదన్నారు. ప్రభుత్వ భూమి అనే బోర్డు మాయం చేసి ప్రస్తుతం కబ్జా స్థలాన్ని కలుపుకున్నారని కెటిఆర్ ఆరోపించారు.

ఈ విషయంపై దానం నాగేందర్ శనివారం తాజాగా స్పందిస్తూ వందల ఎకరాలు కబ్జా చేసినట్లు బిఆర్‌ఎస్‌పైనే ఆరోపణలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తనకు ఇక్కడ ఏం జరుగుతుందో పూర్తి సమాచారం ఉంటుందన్నారు. బ్రతకడానికి వచ్చిన వాళ్లకే పూర్తి సమాచారం ఉండదన్నారు. తాను కబ్జా చేశానని చెబుతున్న స్థలంలో ప్రభుత్వానికి సంబంధించిన బోర్డును దానం స్వయంగా చూపించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com