Tuesday, April 8, 2025

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంనాగేందర్ కు పదవి గండం?

  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంనాగేందర్ కు పదవి గండం?
  • పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో విచారణ

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైగెలిచి, ఆ తరువాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంనాగేందర్ కు పదవీ కష్టాలు తప్పేలా లేవు. అంతే కాదు ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చేలాఉందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపు అంశంపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును అసెంబ్లీ స్పీకర్‌ తీసుకోలేదని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతితెలిసిందే.

దానం నాగేందర్ విషయంలో శాసనసభస్పీకర్‌ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో కోరారు మహేశ్వర్రెడ్డి. ఈ పిటీషన్ ను విచారించినహైకోర్టు ధర్మాసనం.. మహేశ్వర్‌రెడ్డి పిర్యాదును తీసుకోవాలని, పిటిషనర్‌ కు ధ్రువీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. దీంతో దానం నాగేందర్ పార్టీఫిరాయింపుపై అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోన్న ఆసక్తి సర్వత్రానెలకొంది. సాక్షాధారాలతో మహేశ్వర్ రెడ్డి పిర్యాదు చేయబోతున్నారు కాబట్టి దానంఎమ్మెల్యే పదవి రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.

మరో కేసుకు సంబందించి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్‌ల పైనాహైకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్‌ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారని అడ్వకేట్ డనరల్ కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ కు శాసనవ్యవస్థలో విశేషఅధికారాలు ఉన్నాయని, స్పీకర్ వ్యవస్థలో కోర్టుల జోక్యం చేసుకోలేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఏజీ. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. ఐతే మూడు నెలలైనా ఎమ్మెల్యేలపార్టీ ఫిరాయింపుల పిటీషన్ పై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని కోర్టుఅభిప్రాయపడింది. వివాదం కోర్టులో ఉన్న నేపధ్యంలో స్పీకర్ పిటిషన్లను పరిశీలించలేదని ఏజీ వివరించారు. ఈ పిటీషన్ పై శుక్రవారం మరోసారి విచారణ జరగనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com