Tuesday, January 7, 2025

ఖమ్మంలో కసాయి కోడలు

ప్రవర్తన మార్చుకోవాలన్నందుకు మామను చంపింది

సొంత మామనే కోడలు చంపేసిన ఘటన ఖమ్మంలో జరిగింది. అస్తమానం బయటకు తిరగవద్దని మామ మందలించడంతో కోడలు కక్ష పెంచుకుంది. సమయం చూసి ఓ రోజు నిద్రపోతున్న మామపై వేడి నూనె పోసింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మరణించాడు. తమ అభిప్రాయాలకు విరుద్ధంగా ఏం చెప్పినా మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. మంచి కోసం చెప్పిన ఇతరులపై కక్ష్య పెట్టుకుని చంపేస్తున్నారు. ఇలా కక్ష పెట్టుకుని సొంత మామనే చంపేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు చనిపోవడంతో.. కోడలును మందలించి మంచిగా ఉండాలని చెప్పినందుకు సొంత మామను చంపేసింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని తండాలో ఈ ఘటన జరిగింది.
కారేపల్లి శివారు తండాలో అజ్మీరా బాబు నివసిస్తున్నాడు. కరోనా కారణంగా ఇతని కొడుకు మరణించాడు. అప్పటి నుంచి కోడలు ఉమ పిల్లలతో అత్తవారింట్లోనే ఉంటుంది. కొడుకు చనిపోయిన తర్వాత కోడలు ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో బయట ఎక్కువగా తిరగవద్దని అజ్మీరాబాబు కోడలిని మందగించాడు. పలుమార్లు చెప్పడంతో మామపై కోడలు కక్ష పెంచుకుంది. ఓ రోజు మామ నిద్రపోతుండగా.. సలసల కాగిన వేడి నూనెను తీసుకుని ఒంటిపై పోసింది. వేడి నూనెకి ఒళ్లంతా కాలుతున్న కూడా పట్టించుకోలేదు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అజ్మీరాబాబు కన్నుమూశారు.
ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లకు విషం పెట్టి చంపేశాడు. పొరుగున్న కొందరు వ్యక్తుల నుంచి తమకు వేధింపులు వచ్చాయని.. దాని కారణంగానే చంపేసినట్లుఆ యువకుడు తెలిపాడు. తమ ఇల్లు కబ్జా చేయాలని కొందరు చూశారని.. వారిని అడ్డుకునేందుకు తాను తన తండ్రి ఎంతో కష్టపడ్డాడని తెలిపాడు. 15 రోజులుగా చలిలో తిరిగామని.. ఫుట్‌పాత్ మీదే నిద్రపోతున్నామని అన్నాడు. తమ ఇంటి పత్రాలు తమవద్దే ఉన్నా.. సగం ఇల్లు వారి చేతిలోకి వెళ్లిపోయిందన్నాడు. అందువల్లనే తన తల్లి, చెల్లెళ్లకు మొదట విషం పెట్టి చంపానని.. ఆ తర్వాత చేతి మణికట్టు నరాలు కోసి.. ఊపిరాడకుండా చేశానని ఆ యువకుడు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com