Tuesday, April 15, 2025

Khushi Kapoor డెనిమ్‌ లుక్‌ లో ఖుషికపూర్‌

‘ది ఆర్చీస్’ వెబ్ సిరీస్‌తో న‌టిగా ప‌రిచ‌యం అయింది ఖుషీ క‌పూర్. ఖుషి ఆరంగేట్రం స‌మ‌యంలో జాన్వీ క‌పూర్ బోలెడ‌న్ని స‌ల‌హాలు ఇచ్చింది. ఖుషి ఇంకా డెబ్యూ న‌టి. త‌న‌ను తాను నిరూపించుకుని జాన్వీ త‌ర‌హాలో ఎద‌గాల్సి ఉంటుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ అనిపించుకోవాల్సి ఉంటుంది. అయితే అందుకు ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ స‌ర‌స‌న ఖుషీ త‌న రెండో సినిమా చేస్తోంది. ఈలోగానే ఖుషీ కపూర్ స్పీడ్ గురించి చాలా విస్త్ర‌తంగా వెబ్ లో చ‌ర్చ సాగుతోంది. త‌న అక్క బాట‌లోనే ఖుషి కూడా డేటింగ్ లో ఉంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ఈ భామ న‌టుడు వేదంగ్ రైనా తో ప్రేమలో ప‌డింద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఖుషి వయస్సును బట్టి ప్రేమ, శృంగార సంబంధాలు యువ‌త‌రంలో ఆస‌క్తిక‌రంగా మారాయి. జాన్వీ, ఖుషి ఎవ‌రికి వారు త‌మ బోయ్ ఫ్రెండ్స్ తో చెట్టాప‌ట్టాల్ అంటూ షికార్లు చేయ‌డంపైనా నిరంత‌రం గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఖుషి క‌పూర్ ఫ్యాష‌న్ సెన్స్ గురించి యువ‌త‌రం నిరంత‌రం ముచ్చ‌టించుకుంటోంది. తాజాగా ఖుషీ ప్ర‌ఖ్యాత‌ లెవీస్ బ్రాండ్ కి చెందిన‌ డెనిమ్ షర్ట్ -జాకెట్ ధరించి క‌నిపించింది. ఖుషి డెనిమ్స్ లో షో స్టాప‌ర్ గా నిలిచిందంటూ ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com