Monday, March 10, 2025

Kiara Advani కమాండో ఫైటర్‌గా… కియారా

సాహ‌సోపేత‌మైన పాత్ర‌లో కియారా మొదటిసారి కనిపించనుంది. కానీ ఇప్పుడిప్పుడు కెరీర్ లోకి కొత్త త‌ర‌హా పాత్ర‌లు ప్ర‌వేశిస్తున్నాయి. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న Game Changer ‘గేమ్ ఛేంజ‌ర్’ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డి పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని…ప్ర‌భుత్వ అధికారి పాత్ర అని ఎంతో ఛాలెంజింగ్ రోల్ అని ప్ర‌చారం సాగుతుంది. అలాగే బాలీవుడ్ లో ‘వార్ -2’లోనూ న‌టిస్తోంది. ఇందులో అమ్మడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి జోడీగా న‌టిస్తుంద‌ని స‌మాచారం.

ఇందులో సొగ‌స‌రి క‌మాండో పైట‌ర్ పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర చుట్టూ భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీనిలో భాగంగా కియారా భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొంటుందిట‌. ఇవి సినిమాలో హైలైట్ గా ఉంటాయ‌ట‌. ఇప్ప‌టికే కియారాపై మ‌రికొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ పూర్తి చేసారుట‌.

కియారా ఎంట్రీ కూడా ఓఫైట్ తోనే ఉంటుందిట‌. క‌మాండో గెట‌ప్ లో అమ్మ‌డు ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక కియారా న‌టిస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్’, ‘వార్ -2’పై పాన్ ఇండియాలో భారీ అంచ‌నాలున్నాయి. స‌క్స‌స్ అయితే కియారా రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com