Sunday, March 9, 2025

సీఎం గాలి మాటలకు సమాధానం చెప్పాలా?

మీడియాతో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి
సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మాటలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని,  సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. హోటల్‌ తాజ్‌ వివాంట వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నా గురించి ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజల తీర్పే.. కాంగ్రెస్‌ పార్టీకి, పాలనకు చెంపపెట్టులాంటిది.

నాపై ఆరోపణలకు ప్రజలే సరైన జవాబు ఇచ్చారు. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్‌ రెడ్డి కోరారు. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com