Thursday, January 16, 2025

సౌదీ అరేబియాలో కిషన్‌ ‌రెడ్డి పర్యటన

ఘనంగా స్వాగతంపలికిన ప్రవాస భారతీయులు
సౌదీ అరేబియాలో భారతీయులు అందులో తెలుగు ప్రవాసీయులు కేవలం ఉపాధికి మాత్రమే పరిమితం కాకుండా వాణిజ్య, పరిశ్రమ రంగాలలో కూడా ఎదుగుతుండడం ఎంతో సంతోషం అని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డిఅన్నారు. కుటుంబ సమేతంగా న్యూఢిల్లీలో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న తనను.. ప్రధాని నరేంద్ర మోదీ, వాణిజ్య మంత్రి పియూష్‌ ‌గోయెల్‌ ‌తో కలిసి తన ఇంటికు వచ్చి పండుగ జరుపుకోన్న తర్వాత భారత-సౌదీ సంబంధాల పటిష్ఠతలో తన సౌదీ పర్యటన ముఖ్యమని చెప్పారని అన్నారు. రియాధ్‌ ‌లో ప్రవాసీయులు బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పండుగ మధ్యలో తాను సౌదీకి రావాల్సి వచ్చిందన్నారు. అయితే, మిగిలిన సంక్రాంతిని తోటి తెలుగు వారి మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి సంక్రాంతి మధ్యలో సౌదీ అరేబియా వెళ్లారు.

ఖనిజ భవిష్యత్తుపై జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొనడానికి వెళ్లారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా లోని తెలుగు ప్రవాసీ సమాజం కిషన్‌ ‌రెడ్డికి నీరాజనం పలికింది.  సౌదీలోని ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘం సాటా సెంట్రల్‌ ‌ప్రతినిధులు రంజీత్‌, ‌ముజ్జవ్మిల్‌, ‌సుచరిత, ఆనందరాజు, పోకూరి ఆనంద్‌, ‌శివారెడ్డి, సత్తిబాబులతో పాటు తెలుగు కళా క్షేత్రం అధ్యక్షులు రేవల్‌ అం‌థోని, విజయ చౌదరి, తెలుగు అసోసియెషన్‌ ఆఫ్‌ ‌సౌదీ అరేబియా (తాసా) అధ్యక్షుడు స్వర్ణ తిరుపతి స్వామి, ఉర్దూ టోస్ట్ ‌మాస్టార్స్ ‌ప్రతినిధులు మోబీన్‌, ‌వాసీఫ్‌ ‌హైదరాబాద్‌ ‌నగరానికి చెందిన ప్రవాసీ ప్రముఖలు సుల్తాన్‌ ‌మజ్హరోద్దీన్‌ ‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రవాసీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

20 నిమిషాల పాటు ప్రసంగించి మంత్రి వెళ్ళిపోతారని నిర్వహకులు ప్రకటించినా తెలుగు వారి అప్యాయతతో రెండు గంటల పాటు కిషన్‌ ‌రెడ్డి అందరితో కలిసి మెలిసి గడిపారు. తొలిసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక కేంద్ర మంత్రి సౌదీ కి వచ్చి ఆత్మీయంగా గడపడం ఆనందం కల్గించిందని అనేక మంది తెలుగు ప్రవాసీయులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఎంబసీ సౌజన్యంతో రియాధ్‌ ‌లోని హైదరాబాద్‌ ‌నగరానికి చెందిన వ్యాపారవేత్త మోహమ్మద్‌ ‌నయీమోద్దీన్‌ ‌నిర్వహించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com