Sunday, November 17, 2024

సీఎం రేవంత్‌ సవాల్‌కు నేను సిద్ధం -కిషన్‌రెడ్డి

మూసీనది సుందరీకరణ అంశం పై సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. మూసీ ప్రక్షాళన వ్యతిరేకించే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మూడు నెలలపాటు ఆ ప్రాంతంలో నివాసం ఉంటే సుందరీకరణ అంశాన్ని పక్కనపెడతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ మేరకు తాను రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మూడు నెలలపాటు తాను నివాసం ఉంటానని, మరి ఇందుకు సీఎం సిద్ధమేనా అని ప్రశ్నించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ” మూసీ ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. ముఖ్యమంత్రి సిద్ధమేనా?. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నేను మూడు నెలలపాటు మూసీ ప్రాంతంలో నివాసం ఉంటాను. నది శుద్దికి బీజేపీ వ్యతిరేకం కాదు. పేదల ఇళ్లు కొడితే బీజేపీ ఊరుకోదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌తో నీతులు చెప్పించుకునే స్థితిలో మేము లేము. మూసీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్, బీఆర్ఎస్‌కు లేదు. నది సుందరీకరణకు తెరతీసిందే బీఆర్ఎస్ ప్రభుత్వమే అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular