టాలీవుడ్..బాలీవుడ్.. హాలీవుడ్ ఇలా ఏ భాషలోనైనా సరే కొన్ని కొన్ని సన్నివేశాలు హీరోయిన్లకి ఛాలెంజింగ్‌గానే ఉంటాయి. ఆ పాత్రకి తగ్గట్టుగా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసి ఎటువంటి సన్నివేశాన్నైనా సరే అద్భుతంగా పండించగలిగితేనే నటి అంటారు. లేదంటే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగా కూదరలేదు అంటే మాట్లాడేవాళ్ళు సింపుల్‌గా మాట్లాడేస్తుంటారు. మరి అలాంటి ఛాలెంజింగ్ సీన్ ఒకప్పటి అందాల తార బాలీవుడ్ క్వీన్ కరిష్మాకపూర్కి వచ్చింది. అది కూడా చాలా కెరియర్ స్టార్టింగ్‌లో. మరి తప్పదుకదా దర్శకుడు సీన్ చెప్పగానే మారుమాట లేకుండా ఓకే అనేసింది. ఆ సీన్ చేయడం కష్టమనిపించి అప్పట్లో దాన్ని ఇద్దరు హీరోయిన్లు తిరస్కరించడం కూడా జరిగింది. మరి ఏమిటి ఆ సిన్ ఎవరూ అంటే అగ్ర హీరో సరసన అరుదైన అవకాశం. అమీర్‌ఖాన్‌తో కలిసి కరిష్మా కపూర్ ముద్దు సీన్లో నటించాలి. అది కూడా ఏకంగా మూడు రోజుల పాటు ఆ సీన్ చిత్రీకరణ జరిగింది. ఓవైపు సెట్లో హీరోయిన్ తల్లి వెంబడిస్తోంది. మూడు రోజులు ఆ సీన్ చిత్రీకరణ పూర్తయ్యేవరకూ హీరోయిన్ వెంటే మమ్మీ కూడా ఉన్నారు. మొత్తానికి ఏదోలా షూటింగ్ పూర్తి చేసారు. ముద్దు సీన్ చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ హీరోయిన్ కి బిగ్ బ్రేక్ నిచ్చింది. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లలో నటించేసిన తర్వాత కూడా ఆ ముద్దు సీన్ గురించే ఇంకా మాట్లాడుకున్నారు. అంతగా ప్రభావితం చేసిన ఆ కిస్సింగ్ సీన్ ఇన్నేళ్ల తర్వాత కూడా చర్చగా మారుతోంది. 1996లో అమీర్ ఖాన్- కరిష్మా కపూర్ మూవీ `రాజా హిందుస్తానీ`లో ముద్దు సీన్ గురించే ఇదంతా. ఆ సినిమాతో ఈ జంట అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే గాక, బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 76 కోట్లు వసూలు చేసింది. కరిష్మా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ డెబ్యూ నటిగా ఫిలింఫేర్ ని గెలుచుకుంది. తాజా ఇంటర్వ్యూలో కరిష్మా స్వయంగా ఆ ముద్దు సన్నివేశం కోసం మూడు రోజులు తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో రాజా హిందూస్తానీ మేకర్ ధర్మేష్ దర్శన్ మాట్లాడుతూ…సెట్ లో కరిష్మా చాలా ఉత్సాహంగా ఉందని, మొదటి ముద్దు సన్నివేశమే అయినా నిబద్ధతతో చేసిందని తెలిపారు. ఆ సన్నివేశం గురించి వివరిస్తుంటే అంతగా చెప్పాలా? అని ప్రశ్నించిందని కూడా ధర్మేష్ తెలిపారు. కరిష్మా ఇంకా చాలా చిన్నది.. అందువల్ల ఆమె తల్లి బబితాజీని పిలిచి వివరించానని తెలిపారు.