టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో సెన్సేషన్ గా మారింది అందాల భామ శ్రీ లీల. అనతి కాలంలోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే స్పెషల్ సాంగ్ చేసి నేషనల్ వైడ్ గా మెరిచింది. ఆ క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా నటించే అవకాశాన్ని కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందా? అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో ఓ లుక్కేద్దామా..
కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి తిరుగులేని హీరోయిన్ గా రాణిస్తుంది శ్రీ లీల. ‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ తో ‘ధమాకా’ సినిమాలో నటించే అవకాశం కొట్టేసి.. మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ భామ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఈ సక్సెస్ తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంది. వాస్తవానికి ధమాకా సినిమా ప్లాప్ టాక్ అందుకున్న స్త్రీలు లీలాకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. అయితే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా.. ఈ అమ్మడుకు మాత్రం సరైన క్రెడిట్ రాలేదు. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో సినిమా అవకాశాలను అందుకోలేకపోయింది. ఇలా చాలా తక్కువ కాలంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, నందమూరి బాలకృష్ణ, రవితేజ, నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్ తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది శ్రీలీల. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 సినిమాలో ‘కిస్సిక్’ అంటూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ. స్పెషల్ సాంగ్ లో తళుక్కమన్న శ్రీలీల చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అందాల తార ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా బాలీవుడ్ యంగ్ హీరోతో పుష్ప 2 సినిమాతో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అడుగు పెడుతుంది హీరోయిన్ శ్రీలీల. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ.. హిందీ సినిమాలో నటించబోతుందట. ఈ మూవీకి స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నరట. లవ్ స్టోరీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. “న్యూఇయర్ వేళ రెచ్చిపోయిన అనసూయ..
నెటిజన్లు దారుణంగా కామెంట్స్!” ఇటీవల హీరో కార్తీక్ ఆర్యన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను మూడుసార్లు ప్రేమలో పడి దీపనమయ్యాను అందుకే మరోసారి ప్రేమలో పడబోతున్నాను. అంత ముందు లా కాకుండా ఈ ప్రేమ సఫలం కావాలని కోరుకుంటున్నాను అంటూ తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు హీరో కార్తీక్ ఆర్యన్. ఈ సినిమాకు సమీర్ విద్వాన్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతోంది. దీంతో శ్రీ లీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడబోతుందా? ఆల్రెడీ ప్రేమలో పడిందా? అంటూ పలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ సినిమా సెలబ్రిటీలకు కామనే.