- ఎమ్మెల్సీలుగా
- కోదండరాం, అమిర్ అలీ ఖాన్
- ప్రభుత్వ పాఠశాలలకు, కాలేజీలకు ఫ్రీ కరెంటు?
- ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం
టీఎస్, న్యూస్ :గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమిర్ అలీఖాన్ పేర్లను రాష్ట్ర కేబినెట్ మరో మారు ఫైనల్ చేసింది. ఈ మేరకు తీర్మానం కాపీని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు పంపాలని నిర్ణయించింది. గతంలో వీళ్లిద్దరినీ ఎమ్మెల్సీలు గా ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వీరిద్దరి ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. తుది తీర్పును వెల్లడించిన హైకోర్టు గవర్నర్ నిర్ణయాన్ని తప్పపట్టింది. దీంతో తాజాగా కేబినెట్ వీరిద్దరి పేర్లనూ ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ ఇవాళ తీర్మానం చేసి మరో మారు గవర్నర్ కు పంపింది.
సర్కారు స్కూళ్లు, కాలేజీలకు కరెంటు ఫ్రీ
సర్కారు బడులు, కాలేజీలకు ఉచితంగా కరెంటు సరఫరా చేయడంపై సమావేశంలో మంత్రి వర్గం చర్చించింది. దీంతో పాటు మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఆర్థిక సాయం, ఉద్యోగ నియామకాలు, జీవో 317 అంశాలపైనా చర్చ జరిగింది. వీటితో పాటు మేడిగడ్డ అంశంపైనా కేబినెట్ చర్చిస్తోంది. విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై డిస్కషన్ చేశారు.