Tuesday, December 24, 2024

కోలీవుడ్‌లో కృతి దూకుడు…. మాములుగా లేదుగా?

‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ మొదటి చిత్రంతోనే ఎంత ఫేమస్‌ అయిందో అందరికీ తెలిసిన విషయమే.
ఈ సినిమా విజయంలో ఆమె గ్లామర్ ప్రధానమైన పాత్రను పోషించింది. ఆ తరువాత అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. అందంతో పాటు అదృష్టం కూడా ఉందని అంతా అనుకున్నారు.

కానీ ఇంతలోనే కృతి శెట్టికి పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కాదు అని ఏ హీరోయిన్‌ స్పాన్‌ టైమ్‌ ఎంతవరకు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఒక్కసారిగా హిట్లు కొడతారు అదే తరహాలో ఒక్కసారిగా ఫ్లాప్‌టాక్‌లు మూటగట్టుకుంటారు. ఇక కృతి విషయానికి వస్తే గ్లామర్ విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. డాన్స్ విషయంలోను ఈ బ్యూటీ శభాష్ అనిపించుకుంది. ఇక ఈ ట్రెండ్ కి అవసరమైనంత యాక్టింగ్ ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమెను ఫ్లాపులు పలకరించడం ఎక్కువైపోయింది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై శ్రద్ధ పెట్టింది.

మలయాళంలో టోవినో థామస్ తో ఆమె చేసిన ‘ARM’ .. ఈ ఏడాది అక్కడి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పుడు మలయాళం నుంచి ఆమెకి అవకాశాలు ‘క్యూ’ కడుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కోలీవుడ్ లోను బిజీ అవుతుండటం విశేషం. తమిళంలో కార్తీ .. జయం రవి .. ప్రదీప్ రంగనాథన్ జోడీగా ఆమె చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక మరి మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందో లేదో ముందు ముందు వేచి చూడాలి మరి.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com