Monday, April 7, 2025

రెండు రోజులు మీరు కష్టపడండి… – 55 నెలలు మీకోసం మేం కష్టపడతాం..

  • దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది
  • కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపు

రెండు రోజులు మీరు కష్టపడండి… – 55 నెలలు మీకోసం మేం కష్టపడతాం.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ ముఖ్యనాయకులతో హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన పోలింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాంపై వారికి పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రారంభమైన దగ్గరి నుంచి ముగిసే వరకు ఈ 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. కార్యకర్తలంతా సైనికుల్లాగా పనిచేయాలని ప్రతి ఇంటిని చేరుకోవాలన్నారు. ప్రజల హృదయాలను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా కృషి చేయాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించేలా చూడాలని మంత్రి పేర్కొన్నారు. నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమయ్యిందన్నారు.

14 స్థానాల్లో విజయభేరి మోగించాలి

తెలంగాణలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించబోతున్న ఈ శుభతరుణంలో కార్యకర్తలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు. పోలింగ్ అనంతరం ఈవిఎంలు గోడౌన్‌కు చేరుకునే వరకు ఎక్కడా అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం పనిచేసే అవకాశం కల్పించిన మీ శ్రమకు, మీ కృషికి, పోరాట స్పూర్తికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సమష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి మీ ఆకాంక్షలను నెరవేరుస్తామని ఆయన తెలియజేశారు. ఈ రెండురోజులుఅప్రమత్తంగా పనిచేసి దేశంలో రాబోయే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి ప్రభుత్వంలో తెలంగాణ జెండాను రెపరెపలాడించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com