Thursday, May 22, 2025

కేసీఆర్​ కుటుంబం బెయిల్​ కోసం ప్రయత్నం చేయాలి

  • కేసీఆర్​ కుటుంబం బెయిల్​ కోసం ప్రయత్నం చేయాలి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో పదేండ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన కేసీఆర్​ కుటుంబం పార్లమెంట్​ ఎన్నికల తర్వాత బెయిల్​ కోసం ప్రయత్నాలు చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. కనీసం ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆర్ఎస్ ఆఫీసు లు కట్టారని, జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా కేఏ పాల్ లా తిరగాల్సిందేనన్నారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, రేవంత్ రెడ్డి కి బయపడి కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచన లో ఉన్నట్లు ఆ పార్టీలోనే చర్చించుకుంటున్నారని మంత్రి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని, కవిత జైలుకు వెళ్లిందని, తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారన్నారు.

దర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి కట్టి అబివృద్ది చేశామని కేటీఆర్​ చెప్తున్నాడని, ఎయిర్​పోర్ట్​, పీవీ ఎక్స్ ప్రెస్ వే లాంటివి కాంగ్రెస్​ నిర్మించిందని గుర్తు చేశారు. బీఆర్​ఎస్​ పాలనలో ఐఎఎస్ లను అందరినీ పక్కన పెట్టి నలుగురు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేశారని, ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిందే కేటీఆర్ అని మండిపడ్డారు. పార్లమెంట్​ ఎన్నికల్లో 12 సీట్లకు తగ్గకుండా కాంగ్రెస్​ గెలుస్తుందని, బీఆర్​ఎస్​కు కొన్నిచోట్ల డిపాజిట్​ కూడా రాదన్నారు. కేసీఆర్​ బిడ్డ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. ఇక, బీజేపీ ఫ్లోర్​ లీడర్ గా ఎంపికై నెల రోజులు కానీ వ్యక్తి ఆర్టీఐ కింద 70 లెటర్ లు పెట్టాడని ఏలేటీ మహేశ్వర్​రెడ్డిని ఉద్దేశించి అన్నారు. సీనియర్ నేత రాజాసింగ్ కు కాదని ఎల్పీ పదవి తీసుకున్నాడని, ఆయన పేరు చెప్పాలంటేనే తనకు ఇన్సల్ట్​గా ఉందని మంత్రి అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com