-
సన్నాసుల కామెంట్‌లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు
-
రేపో, మాపో కెసిఆర్ కూడా జైలుకు వెళతారు
-
కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావులకు జైలులో బెర్త్ ఖరారులు
సన్నాసుల కామెంట్‌లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేసిన ఆరోపణలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. శుక్రవారం సాయంత్రం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్ మాటలను ఆయన కొట్టిపారేశారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. రేపో, మాపో కెసిఆర్ కూడా జైలుకు వెళతారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఒక్కరే కాదు, కొడుకు కెటిఆర్, అల్లుడు హరీష్ రావులకు జైలులో బెర్త్ ఖరారయిందంటూ ఆయన కామెంట్స్ చేశారు.
ఆ ఫస్ట్రేషన్‌లోనే కెసిఆర్ ఇష్టం మొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కెసిఆర్‌కు నిజాం కంటే ఎక్కువ ఆస్తి ఉందన్నారు. ఆ ఆస్తులన్నీ వసూలు చేసి ప్రజలకు పంచి పెడతామని ఆయన కీలక ప్రకటన చేశారు. నేను ఇంకా అద్దె ఇంట్లోనే ఉన్నాను. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఎప్పుడూ కాంట్రాక్టర్ పనులు కూడా చేయలేదు. రాష్ట్రంలో తానే అసలైన ఉద్యమకారుడిని అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బిఆర్‌ఎస్ అంటోందని, దమ్ముంటే చర్చకు రావాలని మంత్రి కోమటిరెడ్డి సవాల్ చేశారు.