Sunday, September 29, 2024

ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరుగును.

“కళావేదిక” (ఆర్‌.వి..రమణ మూర్తి గారు), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడును . ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా రావాలన్న మా ఆహ్వానాన్ని మన్నించి అంగీకరించినందుకు తెలంగాణ రాష్ట్రా రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఆయన ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. కావున ఈ నెల 29 న సినీ ప్రముఖులు, ఎన్‌టిఆర్‌ అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular