Saturday, September 21, 2024

తొలి, మలి దశ తెలంగాణ సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీది కీలక భూమిక

మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈనెల 27వ తేదీన కొండా జయంతిని
రాఫ్ట్ర ఉత్సవంగా జరుపుకోవాలి
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

తొలి, మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని (ఈనెల 27వ తేదీన) రాష్ట్ర ఉత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్సవాలకు సంబంధించి బిసి వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బడ్జెట్‌ను కేటాయిస్తుందని సిఎస్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో….
ఈనెల 27వ తేదీన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. నైజాం వ్యతిరేక పోరులో ఓ వైపు పాల్గొంటూనే, మరో వైపు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వందేమాతరం, క్విట్ ఇండియా ఉద్యమాల్లోనూ బాపూజీ భాగస్వామి అయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయటంతో పాటు నిరంతరం బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి బాపూజీ తపించారని ముఖ్యమంత్రి తెలిపారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular