Wednesday, December 25, 2024

కేటీఆర్ వల్లనే నాగచైతన్య–సమంత విడాకులు బాంబు పేల్చిన కొండా సురేఖ!

టాలీవుడ్ లో ఒకప్పుడు పర్ఫెక్ట్ గా కపుల్ గా పేరు పొంది అనూహ్యంగా దాదాపు మూడేళ్ల క్రితం విడిపోయి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చారు నాగచైతన్య–సమంత. అయితే వీరి విడాకులకు కారణం ఏంటనేది ఇంతవరకూ ఇద్దరిలో ఎవరూ అధికారికంగా చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి విడాకులపై రోజుకో చర్చ జరుగుతుంటది. శోభితా దూళిపాళ్లతో నాగచైతన్య ఎఫైర్ దీనికి కారణమని కొందరు..సమంతకు మరొకరితో ఎఫైర్ కారణమని మరికొందరు సోషల్ మీడియాలో తమకు తెలిసిన జోస్యాలు చెప్తున్నారు.
అయితే నాగచైతన్య–సమంత విడాకుల విషయం ఇప్పుడు మరోసారి హట్ టాపిక్ అయింది. ఈ జంట విడిపోవడానికి తెలంగాణ మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనన్నారు.
బుధవారం గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని  బాపూఘాట్ లో గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ..మాజీ మంత్రి కేటీఆర్ కు హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం అలవాటని.. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది ఆయనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో హీరోయిన్ల ఫోన్లు కేటీఆర్ ట్యాప్ చేశారన్నారు. వాళ్ల జీవితాలతో ఆడుకొని.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేసింది కేటీఆర్ కాదా అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలతో పాటు టాలీవుడ్ లో కూడా హట్ టాపిక్ గా మారాయి.మొన్నమొన్నటి వరకు వీరిద్దరి విడాకులు సినీ వర్గాల వరకే చర్చనీయాంశం అయితే.. ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత నెలలోనే నాగచైతన్య–శోభితా దూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరిద్దరూ పెళ్లికి సిద్దమైన సమయంలో కొండా సురేఖ కామెంట్స్ కాక రేపుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com