Sunday, January 12, 2025

విషాదం మిగిల్చిన‌ సెల్ఫీ స‌ర‌దా..

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు వొచ్చిన‌  ఏడుగురిలో ఐదుగురి గ‌ల్లంతు
ఇద్దరు సుర‌క్షితం..  అం‌దరిదీ ముషీరాబాదే, 20యేండ్లలోపే…
ముఖ్య‌మంత్రి రేవంత్‌ ఆరా, తీవ్ర దిగ్భ్రాంతి
గల్లంతై మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే హరీష్‌రావు దిగ్భ్రాంతి
రూ.15లక్షల చొప్పున ఎక్‌‌గ్రేషియా ఇవ్వాల‌ని డిమాండ్‌

సిద్ధిపేట జిల్లాలో సంక్రాంతి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. కొండపోచమ్మ సాగర్‌ ‌డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వొచ్చారో…సరదాగా సెల్ఫీలు దిగేందుకు వొచ్చారో తెలియదు. కానీ, మొత్తానికి కొండపోచమ్మ సాగర్‌కు వొచ్చిన ఏడుగురు యువకుల్లో ఐదుగురు యువకులను మాత్రం  మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. పండుగ సెలవులు కావడంతో  జిల్లాలోని మర్కూక్‌ ‌మండలంలో గల కొండపోచమ్మ రిజర్వాయర్‌కు సరదా కోసం వొచ్చిన ఏడుగురు యువకులు ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని  సెల్ఫీలు దిగుతున్న క్రమంలో పట్టుతప్పి వీరిలో ఐదుగురు యువకులు ప్రాజెక్టులో గల్లంతు కావడంతో, ఇద్దరు యువకులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతు అయిన వారందరిదీ హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ ‌ప్రాంతం. అందరూ 20యేండ్లులోపు యువకులే.

సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌లోనూ చూస్తుండగానే…సెకన్ల వ్యవధిలో ఐగుగురు యువకులు గల్లంతయి ప్రాణాలను పోగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే…హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ధనుష్‌ (20), ‌లోహిత్‌(17), ‌చీకట్ల ధనేశ్వర్‌(17), 4 ‌సాహిల్‌(19), ‌జతిన్‌ (17), ‌కోమరి మృగంక్‌ (17),  ఎం‌డి ఇబ్రహీం(17) ఏడుగురు కలిసి సంక్రాంతి సెలవులు కావడంతో వీరందరూ సరదా కోసం మూడు ద్విచక్ర వాహనాలపై కొండపోచమ్మ సాగర్‌ ‌డ్యాంకు శనివారం వొచ్చారు. ప్రాజెక్టుకు వొచ్చిన ఈ యువకులందరూ సరదాగా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపుతప్పి కొండపోచమ్మ సాగర్‌లో గల్లంతయ్యారు. గల్లంయిన వారిలో ధనుష్‌, ‌లోహిత్‌, ‌ధనేశ్వర్‌, ‌సాహిల్‌, ‌జతిన్‌ ఉన్నారు. మృగంక్‌, ఎం‌డి.ఇబ్రహీం మాత్రం తృటిలో తప్పించుకున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వారి సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రాజెక్టులో గల్లంతయిన ఐదుగురు యువకుల కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపులు చేపట్టారు.

విషయం తెలుసుకున్న యువకుల తల్లితదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన ముషీరాబాద్‌ ‌నుంచి కొండపోచమ్మ ప్రాజెక్టుకు చేరుకున్నారు. తమ పిల్లలు గల్లంతు కావడంతో ఆ తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి అరణ్య‌రోదనతో ప్రాజెక్టు ప్రాంతమంతా కన్నీటి సాగర్‌గా మారింది. సరదాగ వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల శోకం వర్ణణాతీతం. యువకుల మృతి వార్త తెలిసి ముషీరాబాద్‌లోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ముషీరాబాద్‌ ‌నుంచి సరదా కోసం కొండపోచమ్మ సాగర్‌కు వొచ్చిన ఏడుగురిలో ఐదుగురు గల్లంయిన విషయాన్ని తెలుసుకున్న సిద్ధిపేట పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌బి.అనురాధరెడ్డి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుంది. గల్లంతయిన వారిని వెలికితీసేందుకు పోలీసులు, గజ ఈతగాళ్లు సాగర్‌లో గాలించి మృతదేహాలను బయటకు తీసి మృతదేహాలను  పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   మర్కూక్‌ ‌పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సిఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
సిద్ధిపేట జిల్లాలోని మర్కూక్‌ ‌మండలంలోని కొండపోచమ్మ సాగర్‌ ‌ప్రాజెక్టును సందర్శించడానికి వొచ్చిన ముషీరాబాద్‌కు చెందిన ఏడుగురు యువకుల్లో ఐదుగురు ప్రాజెక్టులో గల్లంతయిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.  ఈ ఘటనపై సిఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

మంత్రి పొన్నం ఆందోళన..
సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ ‌మండలం కొండపోచమ్మసాగర్‌  ‌ప్రాజెక్టులో ఐదుగురు యువకులు గల్లంతైన సమాచారాన్ని తెలుసుకున్న రవాణా, బిసి  సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్‌ ‌మను చౌదరితో మాట్లాడారు. అధికారులు వేగంగా సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టుల వద్దకు  ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com