Friday, April 4, 2025

టెక్స్‌టైల్ పార్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం టాస్క్‌ఫోర్స్

  • టెక్స్‌టైల్ పార్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం టాస్క్‌ఫోర్స్
  • విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై
  • సిఎం రేవంత్ బృందం సమావేశం
  • త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్ కార్ప్ సుముఖత
  • ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సిఎంఓ

తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సౌత్ కొరియాలో బిజీ బిజీగా గడుపుతోంది. అమెరికా పర్యటనను విజయవంతంగా ముంగించుకొని దక్షిణ కోరియా చేరుకున్న ముఖ్యమంత్రి బృందం సోమవారం సియోల్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాల్లో ఒకటైన ఎల్‌ఎస్ కార్ప్ (గతంలో ఎల్‌జీ గ్రూప్‌లో భాగస్వామి) చైర్మన్ కూ జా యన్ తో పాటు ఆ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు వారు సుముఖత వ్యక్తం చేసినట్టు ట్విట్టర్ వేదికగా సిఎంఓ తెలిపింది.

కొరియా బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో

కొరియా పెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ (కేఓఎఫ్‌ఓటీఐ) నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం హాజరైంది. ఈ సందర్భంగా వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో పెట్టుబడులకు అనువైన గమ్యస్థానం అని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సిఎం ఆహ్వానించారు. సిఎం ఆహ్వానంపై యంగ్ గోన్ చైర్మన్ కిహాక్ సంగ్, కేఓఎఫ్‌ఓటీఐ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సోయంగ్ జూతో పాటు 25 ప్రధానమైన టెక్స్‌టైల్ కంపెనీలకు చెందిన అగ్ర నాయకులు ఉత్సాహంతో ప్రతి స్పందించారు. ఈ సమావేశంతో టెక్స్‌టైల్ రంగంలో వరంగల్ తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలకు మరిన్ని పెట్టుబడులు ఆకర్శిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు వేగవంతంగా తీసుకునేలా మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు కలిసి ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సిఎంఓ ట్వీట్‌లో పేర్కొంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com