Wednesday, December 25, 2024

కొత్త రేషన్‌ కార్డుల ఇస్తాం

అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ ప్రకటన

రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత నుంచే కొత్త రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టనుంది. కొత్తగా 36 లక్షల రేషన్ కార్డుల జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. అలాగే ఇకపై రేషన్‌కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా రేషన్ బియ్యం పక్కదానిపై పట్టడంపైనా ఆశక్తికరమైన కామెంట్స్ చేశారు.
సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని, కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశం ఇస్తామన్నారు. ఇప్పటికే కులగణనపై డేటా సేకరించామని, కొత్త రేషన్ కార్డులపై దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం వద్దనున్న డేటా బేస్‌తో కంపేర్ చేసి కొత్త కార్డులు ఇస్తామన్నారు. రేషన్ డీలర్ల ఖాళీలుంటే వెంటనే ఫుల్ చేయాలని ఇప్పటికే కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చామన్నారు. భర్తీ కాకుండా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సభ్యులకు తెలిపారు. రేషన్‌ కార్డుల లెక్కలు పొంతన లేకుండా ఉన్నాయని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. కాకినాడ పోర్టుకు రేషన్‌ బియ్యం పోతోందని అనుమానాలు వ్యక్తం చేశారు. అనర్హులు కూడా రేషన్ కార్డు పొంది ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారన్నారు. దీనిపైనా మంత్రి ఉత్తమ్ స్పందించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వాస్తవమన్నారు. ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈలెక్కన కొత్త కార్డుల వారికి మంత్రి శుభవార్త చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com