సివిల్ సప్లైకి సర్కారు గ్రీన్ సిగ్నల్
రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్ని ఏళ్ల నుంచి రేషన్ కార్డుల కోసం చేస్తున్న నిరీక్షణకు మోక్షం లభించనుంది. మీ పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చే ప్రక్రియ మొదలైంది. ఇప్పటివరకూ రేషన్ కార్డుల్లో అవసరం లేని సభ్యులను తొలగించడం కొసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యులను చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలంగాణ పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల చేరిక కోసం దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తోంది.
మే నెల కోటా కేటాయింపు
ఇప్పటివరకు రేషన్ కార్డులలో సభ్యులు తొలగింపు కొనసాగుతుండగా, తాజాగా కొత్త సభ్యుల చేరిక ఆప్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో దరఖాస్తులు పరిశీలించి కొత్త సభ్యులను అధికారులు ఆమోదిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ అయినప్పటికీ, ఏడేళ్ల వయసు దాటిన వారికి మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వన్నట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులు 20 శాతం మేర పరిష్కరించి వాటికి సైతం మే నెల రేషన్ కోటాను పౌరసరఫరాల శాఖ కేటాయించింది. మిగతా దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పరిశీలించి ఒక్కొక్కటిగా ఆమోదిస్తోంది.
రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు, త్వరలోనే పరిష్కారం
తెలంగాణలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలకు దాదాపు 90 లక్షల మేర రేషన్ కార్డులున్నాయి. కానీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో, అటు ప్రైవేట్ ఆస్పత్రిలో నూ ఈ కార్డులు లేక ఉచిత వైద్యం సైతం చేయించుకోలేకపో తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రేషన్ కార్డులపై కదలిక వచ్చింది. రేషన్ కార్డులు జారీలో జాతీయ జరుగుతున్న, దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రేషన్ కార్డులో కొత్త సభ్యుల చివరి కోసం దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు వేరై రెండు మూడు కుటుంబాలుగా విడిపోయిన, కుటుంబంలో కొత్త వ్యక్తి పుట్టినా ప్రత్యేకంగా రేషన్ కార్డులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెబుతున్నప్పటికీ తమకి ఇంకా రేషన్ కార్డులు జారీ కావడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు, జనవరి నెలలో గ్రామసభలో వచ్చిన దరఖాస్తులు, ఆపై మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ పరిశీలించి ఆమోదిస్తోంది. కొందరు ఒకే రేషన్ కార్డు కోసం మూడు నాలుగు దరఖాస్తులు ఇచ్చినట్లుగా అధికారులు తెలిపారు. అందువల్లే రేషన్ కార్డులు జారీలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇటీవల ఆమోదం పొందిన రేషన్ కార్డులకు మే నెల కోటా కేటాయించినట్లు అధికారులు తెలిపారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ కారణంగా రేషన్ కార్డుల జారీలో జాప్యం జరుగుతోందని నేతలు చెబుతున్నారు. కానీ ఏడాదిన్నర గడిచినా కొత్త రేషన్ కార్డులు తమ చేతికి మాత్రం రాలేదని ప్రజలు అంటున్నారు. రేషన్ కార్డులను రెండు రకాలుగా జారీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిసిందే.