ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
సమంత మాట్లాడుతూ .. ‘వైజాగ్‌కు వస్తే ప్రతీ సారి సినిమా బ్లాక్ బస్టర్ వస్తోంది. వైజాగ్‌లో అభిమానుల్ని చూసి నాకు నిజమైన ప్రేమ ఏంటో అర్థమైంది. మా డైరెక్టర్ ప్రవీణ్ ఎనర్జీ చూసి నేను అంతా మర్చిపోయాను. నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ సినిమాను స్టార్ట్ చేశాను. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రా లా లా ప్రొడక్షన్ బ్యానర్‌ను స్టార్ట్ చేశాను. అదే నా లక్ష్యం. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి ఓ మంచి నవ్వుతో బయటకు వస్తారు’ అని అన్నారు.