Saturday, April 26, 2025

క్రిష్‌..’ఇగో’ తగ్గించుకో బాస్‌

క్రిష్ జాగర్లమూడి టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లలో ఈయన ఒకరు. ఈ పేరు తెలియని వారుండరు. తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన చేసిన వేదం, కంచె సినిమాలకి ఇప్పటికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో.. ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేశారు. అలానే కరోనా కష్ట కాలంలో కూడా కొండపొలం సినిమాను 45 రోజుల్లో… పూర్తి చేశారు. అయితే గత కొంత కాలంగా మాత్రం క్రిష్ ట్రాక్ తప్పారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా డ్రగ్స్ కేసు వ్యవహారంలో సైలెంట్ అయిపోయిన ఆయన సినిమాలను కూడా సైలెంట్ గా తెరకెక్కిస్తున్నట్టు భావించారు. కానీ ఇప్పుడు మాత్రం క్రిష్ వ్వవహారశైలి చూస్తుంటే మళ్లీ అదే తంతు అన్నట్టు చేస్తున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ అనౌన్స్ చేశారు క్రిష్. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దాంతో లేడి సూపర్ స్టార్ అనుష్కతో ‘ఘాటి’ మొద‌లుపెట్టాడు క్రిష్. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తుండగా.. మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యింది. గతంలో క్రిష్ డైరెక్షన్ లో వేదం సినిమాలో వేశ్యగా నటించిన అనుష్క.. ఈ సినిమాతో మళ్లీ గట్టి కం బ్యాక్ ఇస్తుందని ఆశించారు. సినిమాలను తగ్గించేసిన అనుష్క.. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ శెట్టితో ప్రేక్షకులను పలకరించింది. దాంతో ఈ చిత్రం టీజర్ చూసిన ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న రిలీజ్ చేయ‌బోతున్నట్టు మేక‌ర్స్ గ‌తంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో కూడా మూవీ యూనిట్ నిమ్మకునీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉండడంతో ఆడియన్స్ సైతం అయోమయంలో పడ్డారు. అయితే ఈ మూవీ కూడా మధ్యలో ఆగిపోయిందా? లేకపోతే క్రిష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా బాలీవుడ్ లో ఆయన ‘మణికర్ణిక’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని మొదలు పెట్టి, మధ్యలో వెళ్ళిపోయాడు. మిగిలిన సినిమా కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. దాంతో హరిహర వీరమల్లు సినిమా లాగానే, అనుష్క సినిమా నుంచి కూడా క్రిష్ సైలెంట్ గా సైడ్ అయ్యారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇకపోతే అసలు క్రిష్‌ సినిమాలు ఎనౌన్స్‌ చేసేంతవరకు బాగానే ఉండి. సగం షూటింగ్‌ అయ్యాకో.. లేక చివరిదశలో ఇలా వదిలేసి వెళ్ళడం అనేది ఎంత వరకు సమంజసం. ఇలా ఏదో ఒక సినిమాలో చేశారంటే ఓకే.. ఆ సినిమాలో ఎవరితోనో ఏదో ఇబ్బందనో టెక్నీషియన్‌తోనో లేక పలానా నిర్మాతనో లేక పలానా నటీనటులతోనో అని అనుకోవచ్చు. ఇలా ప్రతీ సినిమాకు ఇదే తంతు నడుస్తుంటే ఏమనుకోవాలి. క్రిష్‌కి ఇగో ఎక్కువ అనుకోవాలా. లేక దర్శకత్వమే చేయడం రావడం లేదు అనుకోవాలా. అసలు దర్శకుడు అంటే ఎవరు కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అంటారు. మరి అలాంటిది కెప్టెన్‌ మధ్యలోనే వదిలేసి వెళతారా అంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారా అని అందరూ అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com