దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు!
దివ్వెల మాధురి మీడియా చిట్‌చాట్‌లో కేటీఆర్‌ను కొనియాడింది. కేటీఆర్ తనకు మంచి మిత్రుడని పేర్కొంది. బెల్లంకొండ సురేష్ ద్వారా కేటీఆర్‌ను పార్క్ హయత్‌లో రెండు మూడుసార్లు కలిసానంది. రాజకీయాల్లో పెద్దస్థాయికి వెళ్లాలంటే ఎలా పనిచేయాలో చెప్పేవారని తెలిపింది.
దివ్వెల మాధురి.. గత కొద్ది రోజుల నుంచి తరచూ వినిపిస్తున్న పేరు ఇది. ఎప్పుడైతే వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమెకు ఎఫైర్ ఉందని రూమర్స్ వచ్చాయో అప్పటి నుంచి ఆమె పేరు ఓ రేంజ్‌లో మారుమోగుతోంది. మీడియాలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆమె గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఆ మధ్య దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి లవ్ ఎపిసోడ్స్ చాలా రోజుల పాటు సాగాయి. దాదాపు నెల రోజుల పాటు వీరి వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ అయింది. అంతా వీరిద్దరి గురించే చర్చించుకున్నారు. ఇక ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం బయటకొచ్చిందో ఇద్దరు రియాక్ట్ అయ్యారు.
దివ్వెల మాధురి స్పందిస్తూ తాను, శ్రీనివాస్ కేవలం మంచి స్నేహితులం అని చెప్పుకొచ్చింది. అదే సమయంలో తనపై వచ్చిన రూమర్స్‌కు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తానే కార్ నడుపుతూ యాక్సిడెంట్ చేసుకుంది. ఇది అప్పట్లో బాగా సంచలనం సృష్టించింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ సైతం తన భార్య, బిడ్డలను వదిలి దివ్వెల మాధురితో ఉంటున్నాడు. ఇప్పటికీ వీరు స్నేహితులు అని త్వరలో భార్య భర్తలుగా మారనున్నామని వీరు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇలా వీరి ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి దివ్వెల మాధురి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
కేటీఆర్ ఓపిగ్గా చెప్పేవారు
తాను చాలా సార్లు కేటీఆర్‌ను కలిసానని మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చింది. ఈ మేరకు కేటీఆర్‌ను కొనియాడింది. తాను బెల్లంకొండా సురేష్ ద్వారా కేటీఆర్‌ను పార్క్ హయత్ హోటల్‌లో రెండు మూడు సార్లు కలిసానని పేర్కొంది. కేటీఆర్‌కు పెద్ద పొలిటిషన్ అనే గర్వం ఉండదని.. ఆయన చాలా సరదాగా, జాలీగా ఉంటారని తెలిపింది. రాజకీయాల్లో పెద్ద స్థాయికి వెళ్లాలంటే ఎలా పనిచేయాలో కేటీఆర్ ఓపిగ్గా చెప్పేవారని పేర్కొంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా కేటీఆర్ పొలిటికల్ లైఫ్ చూసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారని తెలిపింది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయాక కేటీఆర్‌తో తనకు కాస్త గ్యాప్ వచ్చిందని.. ఆయనను కలవడం లేదని పేర్కొంది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.