Saturday, January 4, 2025

తెలంగాణ సీఎం అంటే కేటీఆర్‌కు ఎంత కోప‌మో!

రేవంత్ రెడ్డి అలవిగానీ హామీలు ఇచ్చార‌ని మంత్రి కేటీఆర్ విమ‌ర్శించారు. ఆయన చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉంద‌ని.. ఆయన్ను ఎందుకు వదిలిపెడతామ‌ని అన్నారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.. పెన్షన్ నాలుగు వేలు ఇస్తామన్నారు. పది రోజులు ఆగండి 15 వేలు రైతు భరోసా ఇస్తాం అన్నారనీ కానీ ఇవ్వ‌లేద‌న్నారు. మొదటి కేబినెట్ లోనే ఆరు గ్యారంటీ లకు చట్ట బద్దత కల్పిస్తాం అన్నారు. కానీ ఏమైందో తెలియ‌దు. రుణ మాఫీ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. ఎలా చేస్తారో మేము కూడా చూస్తాం. ఎవరైనా అధికారంలోకి రాక ముందు ఆదాయ లెక్కలు చూసుకుంటారు.. కానీ వీళ్లు మాత్రం ఇప్పుడు లెక్కలు చూసుకుంటున్నారు. మేము చేసిన ప్రతీ అప్పుకు ఆడిట్ రిపోర్ట్ ఉంది. వారు చూసుకోక పోతే మాకేం సంబంధమంటూ ధ్వజ‌మెత్తారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com