Thursday, November 21, 2024

అన్ని రంగాల్లో వైఫల్యం.. అన్ని వర్గాల్లో ఆగ్రహం!

సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు!

ఉద్యోగులు..నిరుద్యోగులు..విద్యార్థులు..రైతులు..కార్మికులు..మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారు!

ఐదు డీఏలు పెండింగ్‌లో వుంచడం ఏంటి..ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా?

కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి?

కొత్త పీఆర్‌సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా? 11 నెలలు గడిచినా రెండో PRC నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు?

సీపీఎస్‌ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా?

తెలంగాణ ఉద్యమంలో..స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్‌ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం..!

నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు…కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు..!

ఆశాలు..అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు..!

ఏఈవోల పనిభారం బాధ..ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం..!

ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు..వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి..!.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular