Friday, September 20, 2024

రాఖీ కట్టిన కవితకు కేటీఆర్ విలువైన బహుమతి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి వచ్చాక వారి కుటుంబంలోనే కాకుండా బీఆర్ఎస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. సుమారు ఐదున్నర నేలలపాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ పై బయటకు రావడంతో అంతా భావోద్వేగానికి గురయ్యారు. కవిత జైల్లో ఉన్న సమయంలోనే రాఖీ పౌర్ణమి రావడంతో ఆమె తమ సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టలేకపోయింది. దీంతో ఇప్పుడు జైలు నుంచి వచ్చాక కేటీఆర్ కు రాఖీ కట్టింది కవిత. ఈ సందర్బంగా కవితకు కేటీఆర్ ఏం బహుమతి ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రాఖీ కట్టిన ప్రతిసారి కవితకు విలువైన గిఫ్ట్ ఇచ్చే కేటీఆర్.. ఈ సారి కూడా ఖరీదైన బహుమతే ఇచ్చి ఉంటారని అంతా అనుకుంటున్నారు.

ఐతే కేటీఆర్ కవిత కోసం పడ్డ శ్రమ కంటే విలువైన బహుమతి ఏముంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. చెల్లిగా కవిత జైలులో ఐదున్నర నెలల పాటు ఉండటం, అందులోనూ అనారోగ్యంలో రెండు సార్లు ఆస్పత్రిపాలు కావటం, సుమారు 11 కిలోల బరువు తగ్గిపోయిన పరిస్థితిలో.. ప్రతి సందర్భంలో తోడు ఉంటూ.. ధైర్యం చెప్పటమే కాకుండా.. కోర్టులో బెయిల్ వచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించి చివరికి.. తనను బయటకు తీసుకొచ్చిన కేటీఆర్.. ఆ సోదరికి తన అన్న దగ్గరి నుంచి అంతకన్న ఇంకేం బహుమతి కావాలని అంటున్నారు. కవిత తన పిల్లలకు ఐదున్నర నెలలు దూరంగా ఉండటం ఎంత ఇబ్బందికర విషయమో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కవితను.. తన పేగుబంధానికి దగ్గర చేయటంలో కీలక పాత్ర పోషించి కేటీఆర్.. ఇంకే బహుమతి ఇచ్చి ఆ చెల్లిని అంతకంటే ఎక్కువ ఆనందపర్చగలడని సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు.

చెల్లికి బెయిల్ ఇప్పించటం కంటే పెద్ద గిఫ్ట్ ఇంకేముంటుందని మరికొందరు కామెంట్ చేస్తుంటే, ప్రతి అడుగులో చెల్లికి అండగా ఉండే అన్న దొరకటమే కవితకు దొరికిన పెద్ద గిఫ్ట్ అంటూ మరికొందరు చెబుతున్నారు. ఈ చర్చంతా పక్కన పెడితే.. తన చెల్లి కవిత రాఖీ కట్టటంతోనే.. రాఖీ ఫీలింగ్ తీరిపోయింది.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కేటీఆర్. కవితను జైలు నుంచి విడిపించి ఆమెకు స్పేఛ్చను ప్రసాదించిన కేటీఆర్ కంటే విలువైన బహుమతి ఏముంటుంది చెప్పండి. అందుకే ఆ సంతృప్తితోనే కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos