Thursday, December 26, 2024

KTR Formula E-car race స్మాల్​ రిలీఫ్​

10 రోజుల పాటు అరెస్ట్​ చేయవద్దన్న హైకోర్టు= ఫార్ములా కేసులో క్వాష్​ పిటిషన్​పై విచారణ

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు తాత్కాలికంగా కొంత రిలీఫ్ లభించింది. ఈ కేసును మరో వారం రోజులపాటు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరు వర్గాల వాదనలు విన్న జడ్జీ.. తదుపది విచారణ పది రోజులకు వాయిదా వేశారు. డిసెంబర్ 27న మరోసారి విచారణ జరగనుంది. అలాగే దీనిపై డిసెంబర్ 30లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

14 నెలలకు కేసు పెట్టారు
హైకోర్టులో కేటీఆర్‌ తరఫున న్యాయవాది సుందరం తన వాదనలు వినిపించారు. కేటీఆర్‌ లబ్ధి పొందినట్లు ఎఫ్​ఐఆర్​లో పొందుపర్చలేదని, రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని తెలిపారు. సీజన్‌ 9లో అగ్రిమెంట్ జరిగింది. సీజన్ 10కి అగ్రిమెంట్ అవసరం లేదు. అగ్రిమెంట్ జరిగాక 14 నెలలకు కేసు పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏసీబీకి ఏం సంబంధం. కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ చూసుకుంటుంది. రేసు కోసం నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్‌పై కేసు ఎందుకు పెట్టారు. అసలు కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారని ప్రశ్నించారు.

ఎలాంటి అధారాలు లేవు
ఇక గతేడాది Season 9 Car Racing సీజీన్ 9 కార్ రెసింగ్ నిర్వహించారు. ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి 2022 అక్టోబర్ 25లోనే ఒప్పందం జరిగింది. Formula E operations ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం జరిగింది. సీజన్ 9లో రూ.110 కోట్ల లాభం వచ్చింది. సీసన్ 10 కోసం ఓ సంస్థ తప్పుకుంది. దీంతో ప్రభుత్వం ప్రమోటర్‌గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందానికి కొనసాగింపుగా కొత్త ఒప్పందం జరిగింది. ఎన్నికల కోడ్ ఉల్లగించారనడానికి ఎలాంటి అధారాలు లేవు. ప్రొసీజర్ పాటించలేదు అనడం సరైంది కాదు. 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా కేవలం రాజకీయ కక్ష్యాలతోనే ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a) సెక్షన్ దీనికి వర్తించదని లాయర్ సుందరం వాదనలు వినిపించారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com