Saturday, March 15, 2025

తెలంగాణలోబిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌..

ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా అవసరమా…?
గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను కూడా పట్టించుకోవడం లేదు..
కేసీఆర్‌ పై  నిప్పులు చెరిగిన టిపిసిసి చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌
కుల గణనపై రీసర్వే అడిగే హక్కు కేటీఆర్‌కు లేదంటూ ఫైర్‌

ఫాంహౌస్‌కు పరిమితమైన మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావుకు ప్రతిపక్ష హోదా అవసరమా? అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని టిపిసిసి చీఫ్‌, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్‌ కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. వరుసగా మూ డు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజలను కూడా కేసీఆర్‌ ఏన్నడూ పట్టించుకోలేదని మండిపడ్డారు. సోమవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని రిమ్మనగూడ వద్ద గల ఎస్‌ 4 హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో టిపిసిసి చీఫ్‌ మహేష్‌కుమార్‌ మాట్లా డుతూ… గెలిపించిన ప్రజలను పట్టించు కోకుండా ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకు అం టూ ప్రశ్నించారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్‌కు ఎంతో గౌరవంగా ప్రతిపక్ష హోదాను కల్పిస్తే అటు అసెంబ్లీకి రాకు ండా, ఇటు ఆయనను గెలిపించిన గజ్వేల్‌ ప్రజలను పట్టించు కోవడంలేద న్నారు.  కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టాడ న్నారు. 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి వెళ్లారనీ, ఇప్పుడు 7లక్షల పై చిలుకు కోట్ల అప్పు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా మన్నారు.

బిఆర్‌ఎస్‌ పార్టీలో మాజీ మం త్రులు కల్వ కుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్‌ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముగ్గురు నేతల మధ్య మూడుముక్కలాటనడు స్తోం దని, తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ దుకాణం బంద్‌ అయిం దన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ మేక పోతు గాంభీర్యం ప్రదర్శి స్తున్నాడని విమర్శి ంచారు. బిసిల గురించి బిఆర్‌ ఎస్‌ నేతలు మాట్లాడుతుంటే దెయ్యా లు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కుల గణన సర్వేలో పాల్గొనని కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు రీ సర్వే జరపమని అడిగే అర్హత లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాదిలోనే 56 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. నిరుద్యోగ నిర్మూలన కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేర్చామని అన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల చొరవతో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వొచ్చాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బిజెపికి  రాష్ట్రంలో 8 మంది ఎంపిలు ఉంటే బడ్జెట్‌లో తెలంగాణకు వొచ్చిన నిధులు గాడిద గుడ్డు అని ఆక్షేపించారు. ఇక్కడి బిజెపి నేతలకు మతం పేరిట రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందండం ఆనవాయితీగా వస్తోందని విమర్శించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ – బిజెపి  దోస్తీ
ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ – బిజెపి  రెండు పార్టీలు దోస్తీ చేస్తున్నాయని  మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బిఆర్‌ఎస్‌ పార్టీ బిజెపికి మద్దతిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బిఆర్‌ఎస్‌ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని అన్నారు. స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించామన్నారు. కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని ఉద్ఘాటించారు. పారదర్శకంగా కులగణన సర్వే నిర్వహించామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి నరేందర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఓడిరచడానికి బిఆర్‌ఎస్‌- బిజెపి పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ఎన్నికలకు వొస్తున్నాయని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, గజ్వేల్‌`ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ మాజీ ఛ్కెర్మన్‌ గాడపల్లి భాస్కర్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com