కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శి ంచారు. హాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. కేవలం ఉచిత బస్సు ప్రయాణంతో సరిపెట్టారని ఆరోపించారు. చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన ప్రసంగించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామ న్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 1.67 కోట్ల మంది ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి నెలకు రూ.2,500 చొప్పున రూ.30వేలు సీఎం రేవంత్‌రెడ్డి బాకీ ఉన్నారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.17,500 బాకీ పడ్డారు. రైతులందరికీ రుణమాఫీ చేశామని నిరూపిస్తే రాజీనామా చేస్తా. గతంలో రైతుబంధుకు అడ్డుగా పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ మహిళలు, రైతులు నిలదీయాలని ఈ సందర్భంగా కెటిఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రుణమాఫీ వంద శాతం పూర్తయిందని నిరూపిస్తే.. నేను, మా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తాం‘ అంటూ సవాల్ విసిరారు.
ఆరు గ్యారెంటీలు ఇచ్చి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. కేవలం ఫ్రీ బస్సుతో సరిపెట్టారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని చెప్పి.. మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు రేవంత్ రూ.30 వేలు బాకీ పడ్డారని.. రూ.30 వేలు ఇస్తేనే వోటేస్తామని మహిళలు నిలదీయాలని మాజీ మంత్రి అన్నారు. ఎన్నికలప్పుడు రూ.7600 కోట్లు రైతుబంధు వేసేందుకు తాము సిద్ధమైతే ఈసీకి లేఖ రాసి రైతు బంధును వేయనీయకుండా అడ్డుకున్నారన్నారు. యాసంగి పంట సమయంలో రైతుల కోసం రూ.7600 కోట్లు పెడితే.. రేవంత్ ప్రభుత్వం వచ్చాక నాట్లు వేసే సమయంలో కాకుండా.. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం రైతుల ఖాతాలో వేశారని విమర్శించారు. ఒక్కసారి మాత్రమే కేసీఆర్ ఇచ్చిన డబ్బులను రైతు భరోసా కింద వేశారని.. ఆ తరువాత రైతు భరోసా ముచ్చటే లేదన్నారు. ఖచ్చితంగా జనవరి 26న రైతులకు ఇస్తానన్న రైతు భరోసాను ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. అది కూడా రూ.12 వేలు కాదు..
ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మేరకు రూ.15 వేలను రైతుల ఖాతాలో జమ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వానాకాలం పంటకు ఎగ్గొట్టిన రైతు బంధును కూడా రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు వోటేయమని అడిగితే.. ముందు బాకీ తీర్చాకే వోటు వేస్తామని గట్టిగా చెప్పాలని రైతులకు చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.17500 బాకీ ఉంటే.. మహిళలకు సంవత్సరానికి రూ.30 వేల మేర రేవంత్ రెడ్డి బాకీ ఉన్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పచ్చి మోసగాడు అంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 37 రోజులు కాదు దమ్ముంటే 370 రోజులు జైల్లో పెట్టుకో.. భయపడేటోడు ఎవడూ లేడు అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చిచెప్పారు. కానీ ఇచ్చిన ప్రతి హా నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే వెంటాడుతాం.. అడుగూతనే ఉంటాం. పేదల తరపున కొట్లాడుతూనే ఉంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు వస్తారు.. చేయి గుర్తుకు వోటేయండి అని అడుగుతారు. సీఎం రైతు భరోసా కింద ఎకరానికి 17500 చొప్పున బాకీ ఉన్నాడు.. ఆ డబ్బులు చెల్లిస్తే వోట్లు వేస్తామని చెప్పండి.
బాకీ ఉన్నోన్ని అడిగినట్టు గల్లా పట్టుకుని అడగాలి.. అభయ హస్తం భస్మాసుర హస్తం అయిపోందని నిలదీయాలని ఆడబిడ్డలకు, రైతులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళలకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్. కాంగ్రెసోళ్లను నమ్మకండి అని చెప్పిండు. నెలకు 2500 పడ్డాయా..? 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయా.? సర్పంచ్ ఎన్నికలప్పుడు వేస్తడు.. మళ్లీ నాలుగేండ్ల వరకు కనిపించడు. కాబట్టి రైతుబీమా, రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎక్కడ అని నిలదీయండని రైతులకు, ఆడబిడ్డలకు కేటీఆర్ సూచించారు.
ఈ ఏడాది కాలంలో నాలుగైదు లక్షల లగ్గాలు అయ్యాయి. రేవంత్ రెడ్డికి తులం బంగారం దొరకతలేదా ..? బంగారం షాపుడో నిన్ను నమ్మడం లేదా..? పెల్ళైన ఆడబిడ్డలకు 80 వేల చొప్పున బాకీ ఉన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు చేవేళ్లలోనే కాదు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల 10 నియోజకవర్గాల్లో బుద్ధి చెబుదాం. రైతు భరోసా వేయనందుకు, వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టినందుకు, రుణమాఫీ మోసం చేసిందుకు, ఆడబిడ్డలకు రూ. 2500 ఇవ్వనందుకు, మా భూమి మాకే ఉండాలన్న పాపానికి 40 మంది రైతులను జైల్లో పెట్టి హంసించినందుకు.. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం. చివరకు వృద్ధులను కూడా మోసం చేసిండు. ఆసరా పెన్షన్లు 4 వేలు ఇవ్వడం లేదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.రేవంత్ రెడ్డి నోటికి హద్దు లేదు. మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలు అని చెప్పుకుంటుండు.
కేసీఆర్ ఇచ్చిన 44 వేల ఉద్యోగాలను నేను ఇచ్చిన అని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాడు. ఇవాళ షాబాద్‌లో జరిగిన ధర్నా మొట్టమొదటి.. మిగతా చోట్ల కూడా ధర్నా చేస్తాం. 70 లక్షల మంది రైతుల పక్షాన, 22 లక్షల మంది కౌలు రైతుల పక్షాన, భూమి లేని నిరుపేదల పక్షాన అడుగుతున్నాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకో.. అందరికీ రైతుభరోసా జమ చేయ్.. లేదంటే రేపు పంచాయతీ ఎన్నికల్లో నీ వీపు చింతపండు చేస్తారు మా ఆడబిడ్డులు, రైతులు. ఇది ఆరంభం మాత్రమే.. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతూనే ఉంటాం.. ఎన్ని కేసులు పెట్టినా.. జైళ్లకు పంపించినా రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, భారాస నేతలు శ్రీనివాస్‌గౌడ్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.