-
కేసీఆర్ కొడుకు తప్ప ఆయనకు ఎలాంటి గుర్తింపు లేదు
-
పోరాట యోధుడు రేవంత్ రెడ్డి
-
మేడిగడ్డ నాశనం చూసేందుకే బీఆర్ఎస్ పర్యటన
-
డైమండ్ రాణి రోజా.. యాక్సిటెండ్ సీఎం జగన్
-
టీపీసీసీ సీనియర్ నాయకుడు బండ్ల గణేశ్
టీఎస్ న్యూస్: మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయ వినాశకుడు.. విపత్తు అని కాంగ్రెస్ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి కేసీఆర్ పేరు అడ్డు పెట్టుకొనే కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అబ్బాయిగా తప్పా కేటీఆర్ కి ఏ గుర్తింపు లేదని సెటైర్లు వేశారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన బండ్ల.. రేవంత్ రెడ్డిని ఓ పోరాట యోధుడిగా అభివర్ణించారు. బీఆర్ఎస్ పెట్టిన చిత్రహింసలు, మానసిక క్షోభ అధిగమించే ఆయన సీఎం అయ్యాడని చెప్పారు. కేటీఆర్ చుట్టూ వైఫై లాగా ఈగో ఉంటుందని అందుకే రేవంత్ సీఎం కావడంతో ఆయన బాధపడుతున్నాడని అన్నారు. సీఎం పని తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతుంటే అది చూడలేకే వందల యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి రేవంత్ ని తిట్టిస్తున్నారని బండ్ల గణేష్ ఆరోపించారు. కేటీఆర్ కాల్ చేస్తే ఆ పార్టీ అభ్యర్థులు పారిపోతున్నారన్నారు. ఎన్నికల్లో ఓటమితో కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారనీ, పగవాళ్లకు కూడా ఆయన పరిస్థితి రావొద్దని దేవుడ్ని వేడుకుంటున్నట్లు వివరించారు. కేటీఆర్‌కు ఈగో ఎక్కువ అని, అది వైఫై తరహా ఆయన చుట్టూ ఉంటుందని ఎద్దేవా చేశారు. అమెరికాలో ఇల్లు కొనుక్కోవడానికి కేటీఆర్ అమెరికా వెళ్లారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర కోట్లాది రూపాయల నల్లధనం దొరుకుతోందని బండ్ల గణేష్ ఆరోపించారు. అలాగే మేడిగడ్డ బ్యారేజీని పరిశీలనకు వెళ్లనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,నేతలు పర్యటనపై స్పందించిన బండ్ల గణేష్.. అక్కడికి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ ఎలా నాశనం చేశారో చూసి వస్తారా అంటూ సెటైర్లు వేశారు.
డైమండ్ రాణి.. యాక్సిడెంట్ సీఎం..!
రేవంత్ రెడ్డిని ఓ జాక్ పాట్ సీఎం అని కామెంట్ చేసిన ఏపీ మంత్రి రోజాకు బండ్ల గణేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రోజాను ఓ డైమండ్ రాణిగా.. ఆమె పని చేస్తున్న పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ను యాక్సిడెంట్ సీఎంగా అభివర్ణించారు.అదే సమయంలో రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్ అని పేర్కొన్నారు. రోజా తరహా ఇక్కడ చేపల పులుసు వండి పెడితే ప్రభుత్వంలో పదవులు రావని విమర్శించారు.