- తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు
- రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా?
- విమర్శలకు నోటీసులే సమాధానమా?
- అయితే నీకు నోటీసులు పంపుతాకాచుకో
- నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా?
- నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన
- మాటకు మాట నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా
- కేటీఆర్ లీగల్ నోటీసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు జవాబు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు.
అక్టోబర్ 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. నాపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసుల్లో పేర్కొన్నారు. నేను డ్రగ్స్ తీసుకుంటానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డానని సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా ఆయన ప్రస్తావించారని నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన కామెంట్స్ తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసుల్లో కేటీఆర్ తెలిపారు.