Wednesday, January 8, 2025

కేటీఆర్‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చిన ఈడీ

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్(ఈడీ) మ‌రోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచార‌ణ‌కు రావాల‌ని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. వాస్త‌వానికి ఈడీ ఎదుట కేటీఆర్ ఇవాళ హాజ‌రు కావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్‌లో ఉందని తెలిపారు. హైకోర్టుపైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఈడీకి కేటీఆర్‌ సమాధానం పంపారు.
అయితే ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది కోర్టు. ఈ క్ర‌మంలో ఈడీ తాజాగా మ‌ళ్లీ నోటీసులు జారీ చేసి 16న విచార‌ణ‌కు రావాల‌ని కేటీఆర్‌ను ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్‌ టీమ్‌లో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేస్తున్నారు. కాగా, క్వాష్‌ పిటన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నందీనగర్‌లోని కేటీఆర్‌ నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com