ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన బలగం
బలగం చిత్ర బృందానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రఖ్యాత ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో బలగం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా ఎంపికవడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్- ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ పెట్టారు. బలగం మూవీ డైరెక్టర్ వేణుతో పాటు ఈ సినిమాకు పనిచేసిన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇది మీ కష్టానికి దక్కిన ప్రతిఫలం.. భవిష్యత్‌లో మరిన్ని సాధించేందుకు ఇది తొలిమెట్టు.. అని కేటీఆర్ అన్నారు.
ఇక బలగం గత యేడాది 3 మార్చి 2023లో చిన్న సిమిమాగా విడుదలై పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్స్, భావోద్వేగాల కధతో కమేడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ అందరిని ఆకట్టుకుంది. తాజాగా ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్టుల్లో బలగం ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ గా ఎంపికవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.